ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Suicide Attempt: సత్యసాయి జిల్లాలో విషాదం.. తల్లి, పిల్లల ఆత్మహత్యాయత్నం

By

Published : Jun 2, 2022, 12:41 PM IST

Suicide: సత్యసాయి జిల్లా అమడగూరు మండలం చినగానిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. పురుగుల మందు తాగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు యత్నించారు. కుటుంబ కలహాలే ఘటనకు కారణమని తెలుస్తోంది.

suicide attempt
suicide attempt

Suicide Attempt: సత్యసాయి జిల్లా అమడగూరు మండలం చినగానిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. పురుగుల మందు తాగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు యత్నించారు. చినగానిపల్లి చెందిన గౌతమి.. తన ఇద్దరు పిల్లలకు పురుగులమందు తాగించి, తానూ ఆత్మహత్యకు యత్నించింది. అపస్మారకస్థితిలో ఉన్న ముగ్గురిని గుర్తించిన బంధువులు..కదిరి ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స తర్వాత తల్లితోపాటు 14నెలల చిన్నారిని అనంతపురం తరలించారు.

బాలుడు కదిరి ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. కుటుంబ కలహాలే ఆత్మహత్యాయత్నానికి కారణమని తెలుస్తోంది. గౌతమి భర్త ఆదిమూర్తి మద్యానికి బానిసై వేధిస్తుండడంతోనే ఆత్మహత్యకు యత్నించి ఉంటారని బాధితురాలి తండ్రి తెలిపారు. ముగ్గురి పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details