ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం.. రైతు మృతి!

By

Published : May 25, 2022, 9:01 AM IST

Updated : May 25, 2022, 11:38 AM IST

elephant
చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం

08:59 May 25

ATTACK: చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కొత్తఇండ్లు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున సుబ్రమణ్యం (71) అనే రైతు పొలానికి వెళ్లగా.. అదే సమయంలో అటు వైపుగా వస్తున్న ఏనుగుల గుంపు అతన్ని తొక్కి చంపేశాయి. గత వారం రోజులుగా ఇదే ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తున్నా అటవీశాఖ అధికారులు చొరవ చూపడం లేదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిణామాలు ఇంతకు ముందు అనేక సార్లు జరిగాయని.. అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తిన విధంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. కలెక్టర్ వచ్చేంతవరకు తమ ధర్నా కొనసాగుతుందని రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated :May 25, 2022, 11:38 AM IST

ABOUT THE AUTHOR

...view details