ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అనధికార లోన్‌ యాప్స్‌కు సహకరించే బ్యాంకులపై చర్యలు: డీజీపీ

By

Published : Oct 14, 2022, 10:11 PM IST

DGP ON LOAN APPS HARASSMENTS : లోన్ యాప్స్ వేధింపులతో రాష్ట్రంలో ఆత్మహత్యలు జరగటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. యాప్ ఆగడాలను అరికట్టేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసినట్లు డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన 75 కేసుల్లో 71 మందిని అరెస్ట్ చేశామన్నారు.

DGP ON LOAN APPS
DGP ON LOAN APPS

DGP ON LOAN APPS : అనధికార లోన్‌ యాప్స్‌కు సహకరించే బ్యాంకులపై చర్యలు తీసుకుంటామని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే 173యాప్‌లను బ్లాక్‌ చేశామని ఆయన తెలిపారు. లోన్ యాప్స్‌పై రాష్ట్రంలో 75 కేసులు నమోదవ్వగా.. 71మందిని అరెస్టు చేశామన్నారు. లోన్ యాప్స్‌కు చెందిన 10కోట్ల 50లక్షల రూపాయలను సీజ్ చేసినట్లు తెలిపారు. లోన్‌యాప్స్‌ నుంచి డబ్బులు కట్టాలని బెదిరింపులు వస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. లోన్ యాప్ బాధితులు 1930 టోల్ ఫ్రీ నెంబర్​కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

లోన్ యాప్​ల్లో అధికంగా చైనాకు చెందినవే ఉన్నట్లు గుర్తించామన్నారు. కీలక నిందితులు విదేశాల్లో ఉంటున్నట్లు విచారణలో తేలిందన్నారు. డబ్బును ప్రజలకు ఎరగా వేసి వేధిస్తూ.. అధికంగా నగదు వసూలు చేస్తున్నారన్నారు. డబ్బు చెల్లించటం ఆలస్యమైతే మొదట వేధింపులు.. తర్వాత అసభ్య పదజాలంతో స్నేహితులకు మెస్సేజ్​లు పంపుతున్నారని తెలిపారు. కొందరి ఫొటోలను మార్ఫింగ్ చేసి నగ్న చిత్రాలను కుటుంబ సభ్యులు, స్నేహితులకు పంపుతున్నట్లు కేసుల విచారణలో వెల్లడైందని డీజీపీ తెలిపారు.

అనధికార లోన్‌ యాప్స్‌కు సహకరించే బ్యాంకులపై చర్యలు

యాప్ కీలక సూత్రధారులు ఓ పథకం ప్రకారం లోన్ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఈ కేసుల్లో నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక ప్రొసీజర్​ను రూపొందించాము. ఇన్వెస్టిగేషన్ అధికారి కేసు దర్యాప్తు ఏ విధంగా చేయాలో మ్యానువల్​ను తయారు చేశారు. కింగ్ పిన్ విదేశాల్లో ఉండి ఏజెంట్లతో యాప్​ను తయారు చేయిస్తున్నారు. సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా నెట్​వర్క్​లను నడిపిస్తున్నారు. కొందరికి కమిషన్ ఇచ్చి వేరు వేరు ప్రాంతాల్లో బ్యాంక్ ఖాతాలను తెరిపిస్తూ.. వాటి ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్నారని దర్యాప్తులో తేలింది. బ్యాంక్ ఖాతాల నుంచి పేటీఎం ద్వారా నగదును క్రిప్టో కరెన్సీలోకి మార్చుకుంటున్నారు. ఒక్కొక్కటి గొలుసు కట్టు పద్ధతిలో చేస్తున్నారు. ఎవరైనా వేధింపులకు పాల్పడితే వీరందరిపై కేసు 306, ఎక్సార్షన్ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తాము. రుణ యాప్ వేధింపుల కేసుల్లో బ్యాంక్ అధికారులపై సైతం కేసు నమోదు చేస్తాం.-డీజీపీ రాజేంద్రనాథ్​ రెడ్డి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details