ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Sexual assault on daughter: కన్న కూతురిపైనే అఘాయిత్యం.. రెండు రోజుల వ్యవధిలోనే వరుస ఘటనలు

By

Published : Sep 24, 2021, 7:59 AM IST

వావి వరసలు మరచి మృగాలు రెచ్చిపోతున్నారు. కొన్ని చోట్ల కన్న కుమార్తెలపైనే అఘాయిత్యాలకు(Sexual assault on daughter) పాల్పడుతున్నారు. కేవలం రెండు రోజుల్లోనే తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ఆకృత్యాలు రెండు చోట్ల బయటపడ్డాయి.

Sexual assault on daughter
కన్న కూతురిపైనే అఘాయిత్యం

కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్న తండ్రులే కొన్ని చోట్ల కుమార్తెలపై లైంగిక దాడులకు(Sexual assault) పాల్పడుతున్నారు. ఈ మధ్య ఈ తరహా ఘటనలు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. వావి వరసలు మరచి కుమార్తెలపైనే కామవాంఛ తీర్చుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్​ ఎస్​ఆర్​ నగర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని 17 ఏళ్ల బాలికపై కారు డ్రైవర్​గా పనిచేస్తున్న కన్న తండ్రే అత్యాచారానికి (Sexual assault on daughter) పాల్పడ్డాడు. ఎస్​ఆర్​నగర్​ పరిధిలోని ఓ కాలనీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న కుమార్తెపై ఇటీవల అసభ్యంగా వ్యవహరించాడు. అయితే గురువారం ఇంట్లో ఒంటరిగా ఉన్న కుమార్తెపై అత్యాచారం చేశాడు. దీంతో భయపడిన బాలిక బయటకు పరిగెత్తి.. పక్కింటి మహిళకు జరిగిందంతా చెప్పింది. అలా ఈ విషయం స్థానికులకు తెలిసి.. నిందితునికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటనపై బాలిక తల్లి.. ఎస్​ఆర్​నగర్​ పోలీసులకు ఫిర్యాదుచేసింది. పోక్సో(POCSO) చట్టం కింద కేసునమోదుచేసి.. నిందితున్ని అరెస్ట్​ చేశారు.

రంగారెడ్డి జిల్లాలోనూ..

రెండు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో ఇలాంటి దారుణం జరిగింది. కన్న కూతురిపైనే తండ్రి అఘాయిత్యానికి (Sexual assault on daughter) పాల్పడ్డాడు. భార్య మృతి చెందడంతో... గత 15 రోజులుగా కుమార్తెపై తండ్రే లైంగిక దాడి చేశాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు కీచక తండ్రికి దేహశుద్ధి చేశారు. అనంతరం స్థానికుల సాయంతో బాధితురాలు డయల్​ 100కు సమాచారం ఇచ్చింది. నిందితుడిని అరెస్ట్​ చేసిన పోలీసులు రిమాండ్​కు తరలించారు. కీచక తండ్రిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్​ చేశారు.

గత వారం ఏపీలోని కృష్ణా జిల్లా అజిత్​నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోనూ ఇలాంటి ఆకృత్యం వెలుగులోకి వచ్చింది. ఏడాదిన్నరగా కన్న కూతురిపై తండ్రి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. తండ్రి పెట్టే హింసలు తాళలేక తల్లికి విషయం చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. విజయవాడ పరిధిలోని నున్న పోలీస్​ స్టేషన్​ పరిధిలోనూ ఇలాంటి ఘటన గత వారం బయటపడింది. నిండా అయిదేళ్లు కూడా లేని కన్నబిడ్డపై.. ఓ కసాయి తండ్రే అత్యాచారానికి (Sexual assault on daughter) ఒడిగట్టాడు. కూతురు ఆరోగ్యం బాగోకపోవడాన్ని గుర్తించిన తల్లి.. ఆరా తీయగా.. వచ్చీ రాని మాటలతో తండ్రి చేసిన అఘాయిత్యాన్ని చెప్పడంతో ఆ తల్లి ఒక్కసారిగా నిశ్చేష్టురాలైంది. దాదాపు రెండున్నర నెలల కిందట జరిగిన గత వారం వెలుగులోకి వచ్చింది.

ఇవీచూడండి:

ABOUT THE AUTHOR

...view details