ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అపహరణకు గురైన శిశువు లభ్యం.. వరంగల్ రైల్వే స్టేషన్‌లో గుర్తించిన పోలీసులు

By

Published : May 16, 2022, 3:29 PM IST

Baby Kidnap: తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయం వద్ద అపహరణకు గురైన శిశువు ఆచూకీ లభ్యమైంది. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ తెల్లవారుజామున శిశువును కిడ్నాప్​ చేయగా.. గాలింపు చేపట్టిన పోలీసులు వరంగల్ రైల్వే స్టేషన్​లో గుర్తించారు.

Baby Kidnap
అపహరణకు గురైన శిశువు లభ్యం.. వరంగల్ రైల్వే స్టేషన్‌లో గుర్తించిన పోలీసులు

Baby Kidnap: తెలంగాణలోని సిరిసిల్ల వేములవాడ రాజన్న ఆలయం వద్ద శిశువు కిడ్నాప్​ కథ సుఖాంతమైంది. ఇవాళ ఉదయం అపహరణకు గురైన శిశువును పోలీసులు గుర్తించారు. వరంగల్​ రైల్వేస్టేషన్​లో నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు జరిపిన పోలీసులు అపహరణకు గురైన కొన్ని గంటల్లోనే ఈ కేసును ఛేదించారు.

కరీంనగర్‌కు చెందిన లావణ్య అనే మహిళ నాలుగు రోజులుగా తన ఇద్దరు పిల్లలతో ఆలయం మెట్ల వద్ద ఉంటోంది. రాత్రి సమయంలో లావణ్య ఆలయ పరిసరాల్లో నిద్రిస్తుండగా ఓ మహిళ శిశువును అపహరించింది. అపహరణకు ముందు లావణ్యకు మద్యం తాగించారు. ఆమె నిద్రమత్తులోకి వెళ్లగానే శిశువును అపహరించారు. కుటుంబ కలహాలతో లావణ్యను భర్త వదిలేసి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టి చిన్నారిని కాపాడారు.

అపహరణకు గురైన శిశువు లభ్యం.. వరంగల్ రైల్వే స్టేషన్‌లో గుర్తించిన పోలీసులు

ఇవీ చదవండి :రాష్ట్రానికి తెదేపా అవసరాన్ని చాటేలా.. మహానాడు జరపాలి : చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details