ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విశాఖ రుషికొండ కూడలి వద్ద సీపీఐ నేతలను అడ్డుకున్న పోలీసులు

By

Published : Aug 1, 2022, 10:05 AM IST

Updated : Aug 1, 2022, 10:55 AM IST

Police stopped CPI leaders

10:03 August 01

రుషికొండ వద్ద హరిత రిసార్ట్ నిర్మాణ స్థలం పరిశీలనకు వెళ్తుండగా అడ్డగింత

సీపీఐ నేతలను అడ్డుకున్న పోలీసులు

Police stopped CPI leaders: విశాఖ రుషికొండ కూడలి వద్ద సీపీఐ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. రుషికొండ వద్ద హరిత రిసార్ట్ నిర్మాణ స్థలం పరిశీలనకు వెళ్తుండగా సీపీఐ నేత నారాయణ సహా పలువురు నేతలను పోలీసులు అడ్డగించారు. దీంతో.. స్థల పరిశీలనకు అభ్యంతరాలేంటో చెప్పాలని పోలీసులను నారాయణ నిలదీశారు. రుషికొండ మార్గంలో బారికేడ్లు ఏర్పాటుచేసి పోలీసులు... ట్రాఫిక్ మళ్లిస్తున్నారు.

స్థల పరిశీలనకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడాన్ని సీపీఐ నేత నారాయణ తీవ్రంగా ఖండించారు. రుషికొండ మొత్తం తవ్వేస్తారా? అంటూ మండిపడ్డారు. రుషికొండ చూస్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. 'మేం ఉగ్రవాదులమా... ఎందుకు అడ్డుకుంటున్నారు' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకృతిని నాశనం చేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

"రుషికొండ మొత్తం తవ్వేస్తారా?. రుషికొండ చూస్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారు. మేం ఉగ్రవాదులమా... ఎందుకు అడ్డుకుంటున్నారు. ప్రకృతిని నాశనం చేస్తామంటే ఊరుకునేది లేదు."- నారాయణ, సీపీఐ జాతీయ నేత

నిన్న మీడియా ప్రతినిధులను నిర్బంధించిన రిసార్ట్​ యాజమాన్యం: విశాఖలోని రుషికొండ హరిత రిసార్ట్స్‌లో ఆదివారం మీడియా ప్రతినిధులను యాజమాన్యం బంధించింది. తీవ్ర వాగ్వాదం, తోపులాట తర్వాత మీడియా ప్రతినిధులు బయటకు వచ్చారు. రుషికొండపై నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నాయంటూ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ హైకోర్టులో పిల్‌ వేసిన విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టు ప్రశ్నించిన మేరకు పనులను పరిశీలించేందుకు పిటిషినర్​ మూర్తి యాదవ్​తో కలిసి... హైకోర్టు సీనియర్ న్యాయవాది మూర్తి అక్కడికి వచ్చారు. ఈ నేపథ్యంలో రుషికొండ బీచ్ రిసార్ట్స్ పనుల పరిశీలనకు మీడియా ప్రతినిధులు కూడా వెళ్లారు. రిసార్ట్స్‌కు ఎలా వస్తారని మీడియా ప్రతినిధులతో సంస్థ ప్రతినిధులు వాగ్వాదానికి దిగారు. మీడియాపై బీచ్ రిసార్ట్స్ నిర్వహిస్తున్న సంస్థ ప్రతినిధులు దాడి చేశారు.

ఇవీ చదవండి:

Last Updated :Aug 1, 2022, 10:55 AM IST

ABOUT THE AUTHOR

...view details