ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వృద్ధుడి హత్య కేసును చేధించిన పోలీసులు

By

Published : Aug 29, 2021, 9:35 AM IST

విశాఖ చాపలరేవులో జరిగిన వృద్ధుడి హత్య కేసును పోలీసులు చేధించారు. నిందితుడి అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

accused
నిందితుడు

విశాఖ చేపల రేవు సమీపంలో బుధవారం అర్ధరాత్రి హత్యకు గురైన వృద్ధుడి కేసులో నిందితుడిని ఒకటో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు పట్టుబడినప్పటికీ చనిపోయిన వృద్ధుడి వివరాలు మాత్రం పోలీసులు కనిపెట్టలేకపోతున్నారు.

నగరంలోని బుక్కావీధిలో నివాసముంటున్న గనగళ్ల తాతారావు(23).. ఈ నెల 24న టౌన్ కొత్త రోడ్డు వద్ద గల బార్లో ఓ వృద్ధుడితో గొడవపడ్డాడు. పగ పెంచుకున్న తాతారావుకు బుధవారం రాత్రి చేపలరేవు సమీపంలో ఆ వృద్ధుడు కనిపించాడు. మళ్లీ ఇద్దరికి వివాదం జరిగింది. ఈ ఘర్షణలో తాతారావు పక్కనే ఉన్న బండరాయితో వృద్ధుడి తలపై కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు. స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించామన్నారు. మృతుడి వివరాలు తెలియక పోవటం వల్ల మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీలో భద్రపరిచారు. చనిపోయిన వ్యక్తి జేబులో గంజాయి ప్యాకెట్ దొరకడం.. స్థానికులెవరూ అతడిని గుర్తుపట్టలేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఇదీ చదవండి

MURDER: విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో వ్యక్తి దారుణ హత్య

ABOUT THE AUTHOR

...view details