ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సింహాద్రి అప్పన్న భూముల్లో ఆక్రమణలు తొలగింపు

By

Published : Oct 11, 2020, 4:20 PM IST

మాధవధార వుడా కాలనీలో ఉన్న వివాదాస్పద స్థలంపై సింహాచలం దేవస్థానం అధికారులు స్పందించారు. 13.50 ఎకరాల స్థలంలో చేపట్టిన నిర్మాణాలను శనివారం దేవస్థాన అధికారులు తొలగించారు.

Temple staff removing illegal structures
అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్న దేవస్థానం సిబ్బంది

విశాఖ సింహాచలం మాధవధార వుడా కాలనీలో... అంట్లధారతోటకు ఆనుకుని వివాదంలో ఉన్న 13.50 ఎకరాల స్థలంలో చేపట్టిన నిర్మాణాలను శనివారం దేవస్థాన అధికారులు తొలగించారు. దీనిపై కోర్టులో స్టేటస్‌కో ఉందని, ఆదేశాలు వచ్చే వరకు ఎటువంటి నిర్మాణాలు చేయవద్దని, అలా కాకుండా మళ్లీ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని సింహాచలం దేవస్థానం భూపరిరక్షణ ఏఈఓ ఆనంద్‌కుమార్...‌ సంబంధిత లేఔట్‌ నిర్వాహకులను హెచ్చరించారు.

దేవస్థానం అధికారులు, లేఔట్‌ సభ్యుల మధ్య వాగ్వాదం

అయితే నిర్మాణాలను తొలగిస్తున్న సమయంలో దేవస్థానం అధికారులు, లేఔట్‌ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. అధికారులు సమస్యను వివరించిన అనంతరం గొడవ సద్దుమణిగింది.

ABOUT THE AUTHOR

...view details