ఆంధ్రప్రదేశ్

andhra pradesh

125 Food Items: కాబోయే అల్లుడికి 125 వంటకాలతో విందు.. ఎక్కడో తెలుసా?

By

Published : Oct 7, 2022, 10:03 AM IST

Son In Law: వంటకాలతో కాబోయే అల్లుడినికి తమ అతిథి మర్యాదలు ఎలా ఉంటాయో చూపించాలనుకున్నారు ఆ కుటుంబ సభ్యులు. అందుకుకోసం అల్లుడిని దసరా పండక్కి ఇంటికి ఆహ్వానించారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 125 రకాల వంటలను ఏర్పాటుచేసి అల్లుడి ముందుంచారు. అన్ని వంటకాలను చూసి ఆశ్చర్యపోవడం అతగాడి పనైంది. వంటకాలిన్ని అరగించలేక అయాసపడినట్లు తెలిపాడు. ఇలాంటి అతిథి మర్యాదలను ఉహించలేదని అతడు వెల్లడించాడు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే...

Prepares 125 Food Items For Son In Law For Dussehra
కాబోయే అల్లుడికి 125 వంటకాలతో విందు

125 Food Items For Son In Law: కాబోయే అల్లుడికి 125రకాల వంటకాలుతో ఘనంగా విందు ఏర్పాటు చేశారు విశాఖకు చెందిన ఓ కుటుంబం. విజయనగరంలోని శృంగవరపుకోటకి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ కాపుగంటి చైతన్యకు విశాఖకు చెందిన నిహారికతో వివాహం నిశ్చయం అయింది. వచ్చే ఏడాది వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు.

నిశ్చితార్థం అయ్యాక తొలి పండుగ కావడంతో అల్లుడుని దసరా పండుగకు ఆహ్వానించారు. భోజనం దగ్గరకు వెళ్లేసరికి పెట్టిన వంటకాలు చూసిన అల్లుడు ఆశ్చర్యపోయాడు. ఈ ఏర్పాట్లను చూసి చైతన్య ఆనందబరితుడయ్యాడు. ఈ భారీ విందు ఊహించలేదని తెలిపాడు.

కాబోయే అల్లుడికి 125 వంటకాలతో విందు

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details