ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'ఉద్యోగ సంఘాల్లో విభజన తీసుకురావద్దు'

By

Published : Nov 25, 2020, 11:06 AM IST

నూతనంగా ఏర్పడిన ఏ ఉద్యోగ సంఘమైనా ఉద్యోగుల ప్రయోజనాలు రక్షించేందుకు కృషి చేసే విధంగా ఉండాలి కానీ... వారి ఐక్యతకు ఇబ్బంది కలిగించకూడదని రాష్ట్ర ఉద్యోగుల ఐకాస అమరావతి నేతలు అన్నారు.

apjac employees meeting in visakha
విశాఖలో ఏపీ జేఏసీ అమరావతి నేతల సమావేశం

ఏ ఉద్యోగ సంఘమైనా... ఉద్యోగుల ప్రయోజనాలకు పాటుపడాలని ఏపీ ఉద్యోగ ఐకాస అమరావతి నేతలు కోరారు. కొత్తగా ఏర్పడిన ఉద్యోగ సంఘాలు ఉద్యోగుల సంక్షేమ కోసం పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. స్వార్ధ ప్రయోజనాల కోసం పని చేయకూడదని సంఘ అధ్యక్షులు సత్తి నాగేశ్వరరెడ్డి అన్నారు.

ఉద్యోగ సంఘాలలో విభజన తీసుకొచ్చి... ఐక్యతకు ఇబ్బంది కలిగించకూడదన్నారు. నూతనంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి ఇచ్చిన గుర్తింపును రద్దు చేయాలని సీఎం జగన్​ను కోరుతునట్టు ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details