ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి'

By

Published : Feb 13, 2021, 9:58 PM IST

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.ఆర్. సూర్యనారాయణ కోరారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు.

ap Government Employees Union press meet
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని.. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.ఆర్. సూర్యనారాయణ కోరారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విశాఖలో మీడియా సమావేశం నిర్వహించారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయాలని డిమాండ్ చేశారు. 2011 జూలై నుంచి పీఆర్సీ బకాయి ఉందని.. వెంటనే పీఆర్సీని అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రధానంగా సీపీఎస్ రద్దు సహా 39 సమస్యలపై ప్రాధాన్యత క్రమంలో దృష్టిలో పెట్టాలని సీఎం జగన్​ను కోరారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్​ని వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. మార్చి మూడో తేదీన ఉద్యోగ సంఘాల వ్యవస్థాపకుడు అవని గంటి శ్రీరాములు శత దినోత్సవం సందర్భంగా ఐక్య కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.

ఇద చూడండి:అరకు ప్రమాద మృతదేహాల తరలింపునకు ఏర్పాట్లు పూర్తి

ABOUT THE AUTHOR

...view details