ఆంధ్రప్రదేశ్

andhra pradesh

YSRCP On CBN: హత్యా రాజకీయాలు చేయాల్సిన అవసరం జగన్​కు లేదు: మంత్రి వెల్లంపల్లి

By

Published : Jan 14, 2022, 3:28 PM IST

YSRCP Leaders Fire On CBN: హత్యా రాజకీయాలు చేయాల్సిన అవసరం ముఖ్యమంత్రి జగన్​కు లేదని మంత్రి వెల్లంపల్లి అన్నారు. చంద్రయ్య హత్యతో వైకాపాకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. రాష్ట్రంలో హత్యా రాజకీయాలు, కుట్ర రాజకీయాలు చేసేది చంద్రబాబేనని మంత్రి ఆరోపించారు.

హత్యా రాజకీయాలు చేయాల్సిన అవసరం జగన్​కు లేదు
హత్యా రాజకీయాలు చేయాల్సిన అవసరం జగన్​కు లేదు

YSRCP Leaders Fire On CBN:ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారన్న తెదేపా అధినేత చంద్రబాబు వ్యాఖ్యలపై వైకాపా నేతలు మండిపడ్డారు. చంద్రయ్య హత్యతో వైకాపాకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి వెల్లంపల్లి స్పష్టం చేశారు. హత్యా రాజకీయాలు చేయాల్సిన అవసరం జగన్​కు లేదన్నారు. రాష్ట్రంలో హత్యా రాజకీయాలు, కుట్ర రాజకీయాలు చేసేది చంద్రబాబేనని మంత్రి ఆరోపించారు. చంద్రబాబు దుష్ట ఆలోచనలన్నీ భోగి మంటల్లో తగలబడాలని కోరుకుంటున్నట్లు తెలిపిపారు. లేదంటే ఇదే బోగి మంటల్లో కార్చిచ్చు కావాల్సి ఉంటుందని మండిపడ్డారు. పల్నాడులో జరిగిన హత్యపై దర్యాప్తు జరుగుతుందని మంత్రి వెల్లంపల్లి స్పష్టం చేశారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని వైకాపా ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. జగన్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని..,వీటిని తట్టుకోలేకే చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారన్నారు. మమ్మల్ని ఎదుర్కొనే సత్తా లేక చంద్రబాబు పొత్తుల కోసం ఆరాడుతున్నారని ఎద్దేవా చేశారు. పొత్తుల ద్వారా ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మరో ఎమ్మెల్యే జోగి రమేశ్ ఆరోపించారు. తెదేపా,జనసేన,భాజపా పార్టీలు ఏకమైనా ప్రజా ప్రభుత్వాన్ని ఏం చేయలేవన్నారు. రాబోయే ఎన్నికల్లో వైకాపానే అధికారంలోకి రాబోతుందని చెప్పారు.

ఇదీ చదవండి: CHANDRABABU : జగన్ జాగ్రత్త.. పిన్నెల్లీ ఖబడ్దార్:వైకాపా నాయకులకు చంద్రబాబు హెచ్చరిక

ABOUT THE AUTHOR

...view details