ఆంధ్రప్రదేశ్

andhra pradesh

YSR Rythu Bharosa: నేడు 'వైఎస్సార్​ రైతు భరోసా- పీఎం కిసాన్'​ నిధుల విడుదల

By

Published : Jan 3, 2022, 5:16 AM IST

YSR Rythu Bharosa-PM Kisan-Founds: వైఎస్సార్​ రైతు భరోసా - పీఎం కిసాన్‌ నిధులను సీఎం జగన్‌.. నేడు విడుదల చేయనున్నారు. క్యాంపు కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో రూ. 1036 కోట్లను రైతుల ఖాతాల్లో జమచేయనున్నారు.

YSR Rythu Bharosa
YSR Rythu Bharosa

YSR Rythu Bharosa-PM Kisan-Founds Released: వైఎస్సార్​ రైతు భరోసా - పీఎం కిసాన్‌ నిధులను సీఎం జగన్‌ నేడు విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద రాష్ట్రంలో 50.58 లక్షల మంది రైతులకు..1036 కోట్లను సీఎం జగన్‌ రైతుల ఖాతాల్లో జమచేయనున్నారు. క్యాంపు కార్యాలయంలో నేడు జరిగే కార్యక్రమంలో జగన్.. రైతుల ఖాతాల్లో జమ చేస్తారని ప్రభుత్వం తెలిపింది.​

'రైతు భరోసా కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏటా ప్రభుత్వం.. రూ. 13వేల 500 అందిస్తోంది. తొలివిడతగా పంట వేసేముందు మే నెలలో 7వేల500, రెండో విడతగా అక్టోబరులోపు రూ. 4వేలు, మూడో విడుతగా సంక్రాంతికి రూ. 2వేలు ఇస్తున్నాం. ప్రస్తుతం విడుదల చేస్తున్న మొత్తంతో కలిపి రూ. 19,813 కోట్ల సాయాన్ని రైతులకు అందించాం' అని ప్రభుత్వం పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details