ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Suspension : విధి నిర్వహణలో అలసత్వం.. ముగ్గురు సచివాలయ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు!

By

Published : Nov 24, 2021, 8:24 PM IST

విధి నిర్వహణలో అలసత్వం వహించిన ముగ్గురు సచివాలయ సిబ్బందిపై (Ward Secretariat Employees Suspended) సస్పెన్షన్ వేటు పడింది. విజయవాడ 38 వార్డు సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురుని విధుల నుంచి తప్పిస్తూ.. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ ఆదేశాలు జారీ చేశారు.

ముగ్గురు సచివాలయ సిబ్బంది సస్పెండ్
ముగ్గురు సచివాలయ సిబ్బంది సస్పెండ్

విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ముగ్గురు సచివాలయం సిబ్బందిని (Secretariat Employees Suspended at vijayawada) విజయవాడ మున్సిపల్‌ కమిషనర్ ప్రసన్న వెంకటేశ్ విధుల నుంచి తొలగించారు. విజయవాడ 38వ వార్డు సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న వార్డు సచివాలయ ఇన్​ఛార్జ్ పరిపాలన కార్యదర్శి రాజీవ్ కుమార్, వార్డు విద్య, డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి రాణి, వార్డు ప్రణాళిక, క్రమబద్దీకరణ కార్యదర్శి నాగలక్ష్మిలను సస్పెండ్‌ చేశారు.

38వ వార్డు సచివాలయంలో వాలంటీర్​గా విధులు నిర్వహిస్తున్న సారిక.. డ్యూటీకి గైర్హాజరైనప్పటికీ ప్రతినెలా పూర్తి గౌరవ వేతనం చెల్లించారనే ఆరోపణల నేపథ్యంలో.. వీరిపై అదనపు క‌మిష‌న‌ర్ అరుణ ప్రాథమిక విచారణ జరిపారు. ఈ ఏడాది మే నుంచి సెప్టెంబరు వరకు వాలంటీర్​కు గౌరవ వేతనంగా దాదాపు రూ.25 వేలు చెల్లించి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారని విచారణలో తేలింది. దీంతో వారిని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details