ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'విజయవాడ మేయర్ పీఠం కైవసం చేసుకుంటాం'

By

Published : Mar 12, 2020, 10:56 PM IST

ప్రజల అండతో విజయవాడ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని వైకాపా నాయకురాలు బండి పుణ్యశీల స్పష్టం చేశారు. నగరంలోని 34వ డివిజన్ అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు.

విజయవాడ మేయర్ పీఠం కైవసం చేసుకుంటాం
విజయవాడ మేయర్ పీఠం కైవసం చేసుకుంటాం

విజయవాడ 34వ డివిజన్ వైకాపా అభ్యర్థిగా పుణ్యశీల నామినేషన్

విజయవాడ 34వ డివిజన్ వైకాపా అభ్యర్థిగా బండి పుణ్యశీల నామినేషన్ దాఖలు చేశారు. నగరంలోని పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయల్దేరిన ఆమె.. ఎన్నికల అధికారులకు నామపత్రాలను సమర్పించారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, వైకాపా శ్రేణులు పెద్దఎత్తున పాల్గొన్నారు. తెదేపాకు అభ్యర్థులు కరువై.. మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీల కుటుంబ సభ్యులను బరిలోకి దించాల్సి వస్తోందని ఆరోపించారు. ప్రజల అండతో విజయవాడ మేయర్ పీఠం కైవసం చేసుకుంటామని దీమా వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details