ETV Bharat / city

'డీజీపీ గౌతం సవాంగ్ రాజీనామా చేయాలి'

author img

By

Published : Mar 12, 2020, 3:25 PM IST

రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలన సాగిస్తోందని భాజపా-జనసేన నేతలు విమర్శించారు. ఇతర పార్టీల అభ్యర్థులు నామినేషన్ వేయకుండా అడ్డుకోవడం దారుణమని మండిపడ్డారు.

bjp janasena leaders fires on ycp
వైకాపా ప్రభుత్వంపై భాజపా జనసేన నేతల విమర్శలు

రాష్ట్రంలో నెలకొన్న అరాచక పరిస్థితులకు నైతిక బాధ్యత వహిస్తూ డీజీపీ గౌతమ్ సవాంగ్ రాజీనామా చేయాలని భాజపా రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల నామినేషన్ల ప్రక్రియలో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వైకాపా దాడులను.. భాజపా, జనసేన నేతలు ఖండించారు. రాష్ట్రంలో రాక్షస, అరాచక పాలన కొనసాగుతోందని ఇరు పార్టీల నేతలు వ్యాఖ్యానించారు. వైకాపాకు ఓడిపోతామనే భయముంటే.. ఎన్నికలన్నీ ఏకగ్రీవమని సీఎం ప్రకటించుకోవాల్సిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

వైకాపా ప్రభుత్వంపై భాజపా జనసేన నేతల విమర్శలు

ఇవీ చదవండి.. 'వైకాపా రాక్షసత్వానికి సమానమైన పదం డిక్షనరీలోనూ లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.