ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సామాజిక మాధ్యమాల్లో పిల్లల అశ్లీల చిత్రాలు.. ముగ్గురు మహిళలు సహా 12 మంది అరెస్టు

By

Published : Oct 15, 2022, 11:15 AM IST

Updated : Oct 15, 2022, 4:54 PM IST

చిన్న పిల్లల అశ్లీల చిత్రాలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లోకి అప్‌లోడ్‌ చేస్తున్న వారిపై సీఐడీ చర్యలు తీసుకుంది. ఈ కేసులో ముగ్గురు మహిళలు సహా 12 మంది అరెస్టు చేశారు.

Child pornography in social media
సామాజిక మాధ్యమాల్లో పిల్లల అశ్లీల చిత్రాలు

CHILD PORNOGRAPHY : సామాజిక మాధ్యమాల్లో పిల్లల అశ్లీల చిత్రాలపై సీఐడీ చర్యలు తీసుకుంది. ఈ కేసులో ముగ్గురు మహిళలు సహా 12 మంది అరెస్టు చేసిన పోలీసులు.. 67 బి, ఐటీఏ 2000 - 2008 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. విజయవాడకు చెందిన పలువురు వ్యక్తులు ఫేస్‌బుక్, యూట్యూబ్, జీ మెయిల్ ద్వారా అశ్లీల చిత్రాలు అప్‌లోడ్‌ చేస్తున్నట్లు గుర్తించారు.

సామాజిక మాధ్యమాల్లో చిన్నారుల అశ్లీల చిత్రాలు, వీడియోలు అప్‌లోడ్‌ చేయటం తీవ్రమైన నేరం. దీనిపై నిరంతరం పోలీసు నిఘా ఉంటుంది. ఎవరైనా అప్‌లోడ్‌ చేస్తే.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వెంటనే గుర్తిస్తారు. సీఐడీ విభాగం ఇలాంటి వారి వివరాలను గుర్తించి, స్థానిక పోలీసులకు సమాచారం ఇస్తుంది.

తాజాగా విజయవాడ నగరానికి చెందిన కొంతమంది అశ్లీల చిత్రాలు అప్‌లోడ్‌ చేసినట్లు గుర్తించి సీఐడీ పోలీసులు సమాచారం అందించారు. ఈ మేరకు.. విజయవాడ సైబర్‌ క్రైం పోలీసులు రంగంలోకి దిగి ఒక కేసులో ముగ్గురు మహిళలు సహా 12 మందిపై కేసు నమోదు చేశారు. నిందితులు షేక్‌ షెహనాజ్‌, తెంటు బ్రహ్మానందరావు, గుడివాడ వెంకట మణికంఠ శ్రీపాండు రంగ, చక్కా కిరణ్‌కుమార్‌ రామకృష్ణ, ఎస్‌.కె.నాగుల్‌ మీరావలి, రవి యర్రభనేని, రవి అంజయ్య, కట్టా సాయికృష్ణ, పాల్వంచ తిరుమల లక్ష్మీనరసింహాచార్యులు, ఎస్‌.కె.అంజలి, పులిపాటి భావన, దాసి సరళలపై ఒక కేసు నమోదు చేశారు. అలాగే వెనుటూరుమిల్లి అజయ్‌కుమార్‌, కమలేష్‌ కుమార్‌ చౌదరిలపై మరో కేసు నమోదు చేశారు. మిగిలిన రెండు కేసుల్లో నిందితుల వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవీ చదవండి:

Last Updated : Oct 15, 2022, 4:54 PM IST

ABOUT THE AUTHOR

...view details