ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Varla Ramaiah On CM jagan: ఏ మాత్రం నైతిక విలువలున్నా.. సీఎం పదవికి జగన్​ రాజీనామా చేయాలి

By

Published : Dec 1, 2021, 5:17 PM IST

Varla Ramaiah Demand to CM jagan Resign: ఏ మాత్రం నైతిక విలువలున్నా.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని తెదేపా పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. సీబీఐ కోర్టులో విచారణ అనంతరం నిర్దోషిగా తేలితే తిరిగి పదవీ చేపట్టాలని హితవుపలికారు.

varla ramaiah on cm jagan
ముఖ్యమంత్రి జగన్​పై వర్ల రామయ్య కామెంట్స్

Varla Ramaiah Demand to CM jagan Resign: సీబీఐ కోర్టులో విచారణ ప్రారంభమైనందున.. విచారణ పూర్తయ్యేవరకు ముఖ్యమంత్రి జగన్​.. తనపదవికి రాజీనామా చేయాలని తెదేపా పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఏ మాత్రం నైతిక విలువలున్నా.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని.. విచారణ అనంతరం నిర్దోషిగా తేలితే తిరిగి పదవిచేపట్టాలని హితవుపలికారు. ముఖ్యమంత్రిగా ఉంటే.. ఆయన కిందపనిచేసే అధికారులు ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యంఎలా చెబుతారని వర్ల ప్రశ్నించారు.

గౌరవ న్యాయస్థానం ఈ అంశాన్ని పరిగణించి, ఆయన బెయిల్ రద్దు చేయాలన్న వర్ల... విచారణ కాలంలో ముఖ్యమంత్రిగా వైదొలగాలని ఆయనకు సూచించాలని విజ్ఞప్తిచేశారు. 12వేల ఎకరాల భూమిని ఆయన తండ్రి వాన్ పిక్ సంస్థకు దాఖలుచేస్తే.. రూ. 17వేలకోట్ల విలువైన భూమి దక్కినందుకు వాన్ పిక్ సంస్థ క్విడ్ ప్రోకోగా జగన్​కి చెందిన జగతి పబ్లికేషన్స్​లో రూ. 854కోట్లు పెట్టుబడి పెట్టారని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details