MP KESINENI NANI IN PARLIAMENT: తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ధాన్యం సేకరణపై పార్లమెంటులో కేంద్రం ప్రకటన చేసింది. తెదేపా ఎంపీ కేశినేని నాని ప్రశ్నకు.. కేంద్ర ఆహార, ప్రజాసరఫరాల మంత్రిత్వశాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. గడచిన మూడేళ్లలో రాష్ట్రంలో సేకరించిన ధాన్యం వివరాలను ఇందులో వెల్లడించింది.
PADDY PROCUREMENT: రాష్ట్రం నుంచి 2018-19లో 48.06 లక్షల మెట్రిక్ టన్నులు, 2019-20లో 55.33 లక్షల మెట్రిక్ టన్నులు, 2020-21లో 56.67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు గణాంకాలను అందించింది.
దీనికి తోడు తెలంగాణ నుంచి.. 2018-19లో 51.90 లక్షల మెట్రిక్ టన్నులు, 2019-20లో 74.54 లక్షల మెట్రిక్ టన్నులు, 2020-21లో 94.53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసినట్లు పార్లమెంటు వేదికగా సంబంధిత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఎఫ్‌సీఐ ఆస్తులను అమ్మకానికి పెట్టడం లేదని కేంద్రం ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
MP RAM MOHAN IN PARLIAMENT: విశాఖ-చెన్నై పారిశ్రామిక నడవాకు సంబంధించి తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్‌నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయమంత్రి సోంప్రకాశ్ లిఖితపూర్వకంగా బదులిచ్చారు. విశాఖ-చెన్నై పారిశ్రామిక నడవాకు రూ.2.51 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఆ సొమ్మును శ్రీకాళహస్తి, కడప నోడ్‌ల అభివృద్ధి కార్యకలాపాల కోసం ఖర్చుచేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుత దశలో ప్రాజెక్టు పూర్తికి కాలపరిమితి నిర్ణయించలేదని వివరించారు.
ఇదీ చదవండి: NTR HEALTH UNIVERSITY: ఎన్టీఆర్ ఆరోగ్య వర్శిటీలో ఉద్యోగుల నిరసన