ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Hetero IT Raids: ఆర్థిక ఉగ్రవాదం ఎక్కడుంటే..జగన్​ అక్కడ ఉంటారా ?: వర్ల రామయ్య

By

Published : Oct 12, 2021, 4:31 PM IST

ఆర్థిక ఉగ్రవాదం ఎక్కడుంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉంటారా ?

హెటిరో సంస్థలో ఏసీబీ నిర్వహించిన దాడుల్లో (IT Raids on Hetero Drugs) రూ.144కోట్ల నగదుతో పాటు దాదాపు రూ.550కోట్ల అక్రమ లావాదేవీలు బయటపడటంపై ముఖ్యమంత్రి జగన్ ఏం సమాధానం చెబుతారని తెదేపా నేత వర్ల రామయ్య నిలదీశారు. జగన్ అక్రమాస్తుల కేసుల్లో సహ నిందితులుగా ఉన్న అయోధ్యరామిరెడ్డి, పార్థసారథిరెడ్డిల సంస్థలో పెద్దమొత్తంలో నల్లధనం బయటపడుతుంటే.. సీబీఐ, ఈడీలు ఏం చేస్తున్నాయని ఆయన ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసుల్లో సహ నిందితులుగా ఉన్న అయోధ్యరామిరెడ్డి, పార్థసారథిరెడ్డిల సంస్థలో పెద్దమొత్తంలో నల్లధనం బయటపడుతుంటే.. సీబీఐ, ఈడీలు ఏం చేస్తున్నాయని తెదేపా నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. ఆదాయపు పన్ను శాఖ హెటిరో సంస్థలో నిర్వహించిన దాడుల్లో (IT Raids on Hetero Drugs) రూ.500 నోట్ల కట్టలు కుక్కిన ఓ బీరువా బయటపడిందని అందుకు సంబంధించిన ఫోటోను మీడియా సమావేశంలో ఆయన ప్రదర్శించారు.

బీరువాలో భారీగా నగదు

"ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో హెటిరో పార్థసారథి రెడ్డి ఏ4 నిందితుడిగా ఉన్నారు. ఆదాయపు పన్ను శాఖ గత ఆరు రోజులుగా హెటిరో సంస్థలో నిర్వహించిన దాడుల్లో (IT Raids on Hetero Drugs) రూ.144 కోట్ల నగదుతో పాటు దాదాపు రూ.550 కోట్ల అక్రమ లావాదేవీలు బయటపడటంపై జగన్ ఏం సమాధానం చెబుతారు. రెండు నెలల క్రితం మరో సహ నిందితుడు అయోధ్య రామిరెడ్డికి చెందిన రాంకీ సంస్థలో రూ.300 కోట్ల నల్లధనం, రూ.1200 కోట్ల అక్రమ లావాదేవీలు బయటపడ్డాయి. వీటిపై సీబీఐ, ఈడీలు న్యాయస్థానంలో అనుబంధ కేసులు ఎందుకు దాఖలు చేయలేదు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవ్వటానికి ఈ బ్యాచే కారణం. కరోనా తీవ్రతలో దేశ విదేశాలకు రెమ్​డిసివర్ ఇంజక్షన్లను హెటిరో సంస్థే సరఫరా చేసింది. ఏ4 వద్దే ఇంత పెద్ద మొత్తంలో నల్లడబ్బు దొరికిందంటే.. ఏ1, ఏ2, ఏ3 ల వద్ద ఇంకెంత ఉందో. నల్ల డబ్బు దాచేందుకు బీరువాలతో పాటు అపార్ట్​మెంట్లే కొనుగోలు చేశారట. ఇప్పటి వరకూ 16 లాకర్లే తెరిచారు. మిగిలి ఉన్న లాకర్ల నుంచి ఇంకెంత బయటపడనుందో. ప్రధాని తక్షణమే జోక్యం చేసుకుని సీబీఐ, ఈడీని అప్రమత్తం చేసి, దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం కాకుండా కాపాడాలి. పెద్దమొత్తంలో నల్లడబ్బు బయటపడిన ఆర్థిక ఉగ్రవాది పార్థసారధి రెడ్డిని జగన్ రెడ్డి తితిదే పాలకమండలి సభ్యుడిగా నియమించారు. దీనిపై హైందవ మత పెద్దలు ఆలోచన చేయాలి. మరో ఆర్థిక నేరగాడు అయోథ్యరామిరెడ్డిని రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించారు. ఆర్థిక ఉగ్రవాదం ఎక్కడుంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉంటారా?" -వర్ల రామయ్య, తెదేపా పొలిట్​బ్యూరో సభ్యుడు

ఇదీ చదవండి

hetero drugs: 'హెటిరో' సోదాల్లో అధికారులకు దిమ్మ తిరిగిందట? డబ్బు, బంగారం ఎలా దాచారంటే...

ABOUT THE AUTHOR

...view details