ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Cyber crime: సైబర్‌ మోసాలకూ స్పెషల్ కోచింగ్‌ సెంటర్లు.. పట్టణాల్లో బహిరంగంగానే..

By

Published : Oct 13, 2021, 11:05 AM IST

unknown facts of cyber crimes uncovered in Rachakonda police investigation

సైబర్​ కేసులో నిందితులను అరెస్ట్ చేసిన.. తెలంగాణ రాష్ట్రంలోని రాచకొండ పోలీసులు విచారణ (Rachakonda police investigation) చేపట్టారు. దీనిలో వారు ఊహించని, నివ్వెరపరిచే నిజాలు బయటపడ్డాయి. పదో తరగతి ఫెయిలై, ఏడోతరగతితోనే చదువు ఆపేసిన నిందితులు ఇలాంటి మోసాలు ఎలా చేయగలిగారు అనే అంశంపై పోలీసులు తలామునకలయ్యారు. ఈ నేపథ్యంలో నిందితుల సొంత ఊరికి వెళ్లగా.. పోలీసులు (Rachakonda police investigation) కంగుతిన్నారు. ఎందుకంటే

కొందరు పదో తరగతి ఫెయిలయ్యారు. మరికొందరు ఏడోతరగతితోనే ఆపేశారు. కంప్యూటర్‌ గురించి కనీస అవగాహన లేదు. అయినా వేల మందికి ‘సైబర్‌’ టోపీ ఎలా పెడుతున్నారు..? అనే ప్రశ్న రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసుల (Rachakonda police investigation)ను ఉక్కిరిబిక్కిరి చేసింది. దీనికి సమాధానం కనుక్కునే ప్రయత్నంలో ఉండగా ఝార్ఖండ్‌ ‘దేవగఢ్‌’ జిల్లాలోని పలు పట్టణాల్లో ప్రత్యేకంగా నిర్వహిస్తున్న శిక్షణ కేంద్రాలను అక్కడి ఇన్‌ఫార్మర్లు చూపించడంతో అవాక్కయ్యారు. మోసాలెలా చేయాలి? బ్యాంక్‌ అధికారులుగా ఎలా మాట్లాడాలి? ఉత్తుత్తి ముఖాముఖిలు ఎలా నిర్వహించాలి? తదితర అంశాలపై వాటిలో తర్ఫీదు ఇస్తున్నట్లు తెలుసుకుని (Rachakonda police investigation) కంగుతిన్నారు. 16 కేసుల్లో నిందితులుగా ఉన్న పది మంది దేవగఢ్‌ ముఠా సభ్యులను రాచకొండ సైబర్‌క్రైమ్స్‌ దర్యాప్తు బృందం సోమవారం నగరానికి తీసుకు వచ్చి రిమాండ్‌కు తరలించింది. దర్యాప్తు బృందం (Rachakonda police investigation) దృష్టికి వచ్చిన అంశాలు అందరినీ నివ్వెరపరిచేలా ఉన్నాయి.

ఇంటికో సైబర్‌ నేరస్థుడు

దేవగఢ్‌ జిల్లాలోని అనేక గ్రామాల్లో దాదాపుగా ఇంటికో సైబర్‌ నేరస్థుడు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కొందరు తల్లిదండ్రులు కూడా అటువైపు ప్రోత్సాహిస్తున్నట్లు తెలుసుకుని నిర్ఘాంతపోయారు. వీరిలో చాలామంది ఓ పార్టీలో క్రియాశీలక కార్యకర్తలుగా పనిచేస్తుండటం గమనార్హం. పొరుగునే ఉన్న పశ్చిమబెంగాల్‌ నుంచి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా ఒకేసారి 500 సిమ్‌ కార్డులు తెచ్చుకుంటున్నారు. ఒకరిని మోసం చేయగానే.. ఆ సిమ్‌ కార్డును పక్కన పారేస్తున్నారు.

స్థానిక పోలీసులకు చెప్పి వెళ్తే...

ఫలానా చోట నిందితులున్నట్లు మన పోలీసులు గతంలో టవర్‌ లొకేషన్‌ ఆధారంగా గుర్తించి అక్కడి పోలీసులకు చెప్పారు. అక్కడికెళ్లేసరికి నిందితులు కనిపించలేదు. ఇదే అనుభవం నాలుగైదు సందర్భాల్లో ఎదురైంది. దీంతో అక్కడి పోలీసులకు చెప్పకుండానే మరో చోటుకు వెళ్లగా అక్కడ నిందితులు చిక్కారు. దీంతో పోలీసులు మోసగాళ్లకు సహకరిస్తున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు.

వందకుపైగా ఖాతాల్లోకి ‘సొత్తు’ బదిలీ

ఒక్కో ముఠాలో కనీసం 20మంది వరకు ఉంటారని తొలుత పోలీసులు భావించారు. వాస్తవానికి నలుగురే ఉంటున్నారు. ఇద్దరు కంప్యూటర్లను ఆపరేట్‌ చేస్తుంటే.. మరో ఇద్దరు ఫోన్ల ద్వారా అమాయకులను బోల్తా కొట్టిస్తున్నారు. ఒక్కో ముఠా వద్ద వందకుపైగా బ్యాంక్‌ ఖాతాల వివరాలుంటాయి. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు దోచుకున్న సొత్తును అప్పటికప్పుడు ఆ ఖాతాలకు ఒక్కో దాంట్లోకి రూ.5 వేల నుంచి రూ.10 వేల చొప్పున బదిలీ చేస్తుంటారు. ఆ తర్వాత సదరు వ్యక్తులకు ఫోన్‌చేసి డబ్బులు విత్‌డ్రా చేసుకుని రమ్మని చెబుతున్నారు. వారికి రూ.10 వేలకు.. రూ.వేయి చొప్పున కమీషన్‌ చెల్లిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.

‘స్క్రిప్ట్‌’ ప్రకారమే...

ప్రతి ముఠావద్ద ఒక్కో మోసానికి సంబంధించి (ఉదా।। కేవైసీ, కస్టమర్‌ కేర్‌, ప్రభుత్వ పథకాలు, ఉద్యోగాలు) ఆంగ్లం, హిందీలో రాసిన స్క్రిప్టులు ఉంటాయి. ఈ స్క్రిప్ట్‌ను కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకులు ఇస్తున్నారు. మోసగాళ్లు అందులో ఉన్నట్లే మాట్లాడుతున్నారు. అదనంగా మాట కూడా మాట్లాడరు. మొదటి దోచుకున్న సొత్తును గురుదక్షిణగా కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకులకు అందజేస్తున్నట్లు తెలుసుకుని పోలీసులు ఆశ్చర్యపోయారు. దోచుకున్న సొత్తుతో నిందితులు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నట్లు గుర్తించారు.

ఇదీ చూడండి:

Power Crisis: రాష్ట్రంలో విద్యుత్ కొరత... పరిశ్రమలకు సరఫరాలో కోత!

ABOUT THE AUTHOR

...view details