ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Gandhi Jayanthi: 'గాంధీజీ బోధనలు ప్రపంచ నాయకులకు సైతం స్ఫూర్తిదాయకం'

By

Published : Oct 1, 2021, 10:35 PM IST

మహాత్మా గాంధీ 152వ జయంతి సందర్భంగా రాజ్‌భవన్‌ నుంచి గవర్నర్‌ బిశ్వ భూషణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. జాతిపిత అడుగుజాడలను అనుసరించడం ద్వారా సత్యం, అహింస సూత్రాలకు పునరంకితమవుతామని అంతా ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. గాంధీజీ బోధనలు ప్రపంచ నాయకులకు సైతం స్ఫూర్తిదాయకంగా నిలిచాయని గవర్నర్ కొనియాడారు.

Gandhi Jayanthi
Gandhi Jayanthi

జాతి కోసం మహాత్మాగాంధీ చేసిన అత్యున్నత త్యాగం, అమర స్ఫూర్తి, చెరగని బోధనలు.. భారతీయ ప్రజలకు ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేస్తాయని రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. మహాత్మాగాంధీ 152వ జయంతి సందర్భంగా రాజ్‌భవన్‌ నుంచి గవర్నర్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.

గాంధీజీ బోధనలు ప్రపంచ నాయకులకు సైతం స్ఫూర్తిదాయకంగా నిలిచాయని గవర్నర్ కొనియాడారు. ‘సత్యం’ ‘అహింస’లను తన జీవిత మార్గంగా గాంధీ భావించారన్నారు. బాపూజీ జయంతి రోజున ప్రపంచవ్యాప్తంగా ‘అంతర్జాతీయ అహింసా దినోత్సవం’ జరుపుతున్నామని... జాతిపిత అడుగుజాడలను అనుసరించడం ద్వారా సత్యం, అహింస సూత్రాలకు పునరంకితం అవుతామని అంతా ప్రతిజ్ఞ చేయాలని గవర్నర్ బిశ్వ భూషణ్ పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి

PAWAN KALYAN: రేపు రెండు జిల్లాల్లో జనసేన శ్రమదానం..పాల్గొననున్న పవన్​కల్యాణ్​

ABOUT THE AUTHOR

...view details