ETV Bharat / city

PAWAN KALYAN: నేడు రెండు జిల్లాల్లో జనసేన శ్రమదానం..పాల్గొననున్న పవన్​కల్యాణ్​

author img

By

Published : Oct 1, 2021, 8:19 PM IST

Updated : Oct 2, 2021, 2:47 AM IST

తూర్పుగోదావరి, అనంతపురం జిల్లాల్లో ఇవాళ్టి పవన్‌కల్యాణ్‌ పర్యటన...ఉత్కంఠగా మారింది.రాష్ట్రంలోని రహదారుల దుస్థితిపై నిరసన తెలిపేందుకు....ఈ రెండు జిల్లాల్లో పవన్‌ శ్రమదానం చేయాలని సంకల్పించారు. రాజమహేంద్రవరంలో శ్రమదానం, సభ నిర్వహించే ప్రదేశం....భారీ జనసమీకరణకు అనువైనది కాదని....మరో ప్రత్యామ్నాయం చూసుకోవాలని పోలీసులు సూచించారు. అదే సమయంలో కార్యక్రమానికి అనుమతిచ్చి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని....అనంతపురం జిల్లా నేతలు చెబుతున్నారు.

రెండు జిల్లాల్లో జనసేన శ్రమదానం
రెండు జిల్లాల్లో జనసేన శ్రమదానం

జనసేనాని రహదారుల శ్రమదానంపై సందిగ్ధం కొనసాగుతోంది. రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న రహదాల పరిస్థితిపై గాంధీజయంతి రోజైన ఇవాళ శ్రమదానం చేస్తామని....పవన్‌ ప్రకటించారు. ముందుగా ప్రకటించిన ప్రకారం ఉదయం 9 గంటలకు రాజమహేంద్రవరం చేరుకోనున్నారు. తీవ్రంగా దెబ్బతిన్న ధవళేశ్వరంలోని కాటన్‌ ఆనకట్ట రహదారికి పవన్‌ శ్రమదానం చేయాల్సి ఉంది. వరద, భద్రతా కారణాల దృష్ట్యా జలవనరుల శాఖ అనుమతి ఇవ్వలేదు. అధికారుల సూచనతో రాజమహేంద్రవరంలోని హుకుంపేట – బాలాజీపేట రోడ్డుకు కార్యక్రమాన్నిమార్చుకున్నారు . పవన్‌ పర్యటన నేపథ్యంలో అధికారులు శుక్రవారం సాయంత్రం రోడ్డుపై గుంతల్ని పూడ్చే ప్రయత్నం చేశారు.కంకర, ఫ్లైయూష్‌ మిశ్రమాన్ని దెబ్బతిన్న చోట్ల పోశారు.

తర్వాత ఆ ప్రాంతాన్ని పరిశీలించిన జనసేన నాయకులు....ప్రభుత్వం నాసిరకంగా మరమమ్మతులు చేస్తోందని విమర్శించారు.పవన్‌ రాకకు భయపడి...అరకొరగా దెబ్బతిన్న చోట్ల కాంక్రీటు మిశ్రమాన్ని నింపారని చిన్న లారీ దానిమీద నుంచి వెళ్లినా పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందన్నారు.పోలీసుల సూచన మేరకే శ్రమదానం ప్రదేశాన్ని మార్చుకున్నామని....అయినా ఆంక్షల పేరుతో అడ్డుకోవాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.

ముందుగా శ్రమదానం కార్యక్రమం చేస్తామంటూ జనసేన నేతలు అనుమతి తీసుకున్నారన్న పోలీసులు....తర్వాత సభ నిర్వహిస్తామని చెప్పారన్నారు.సభ నిర్వహణకు బాలాజీపేట రోడ్డు అనువైనది కాదని మరో ప్రత్యామ్నాయం చూసుకోవాలని సూచించామని చెబుతున్నారు.ప్రజాశ్రేయస్సు, భద్రత దృష్టా మాత్రమే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజమహేంద్రవరం ఏఎస్పీ లతా మాధురి చెప్పారు.

రాజమహేంద్రవరం తర్వాత మధ్యాహ్నం సమయంలో అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువుకు....పవన్‌ వెళ్లనున్నారు. స్థానిక రహదారికి మరమ్మతులు చేయనున్నారు. శుక్రవారం ఉదయం నుంచి నాన్చుతూ వచ్చిన పోలీసులు...చివరకు అనుమతి ఇచ్చారు. అయితే అనుమతిచ్చీ....అడ్డుకునే యత్నం చేస్తున్నారని స్థానిక జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. కచ్చితంగా భారీ ఎత్తున సభ నిర్వహిస్తామని చెబుతున్నారు.పర్యటన అనుకున్న ప్రకారం జరిగితే...తిరుగు ప్రయాణంలో పుట్టపర్తిలోని సత్యసాయి మహాసమాధిని పవన్‌ దర్శించుకోనున్నారు.

ఇదీచదవండి.

BABY KIDNAP: రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌లో చిన్నారి అపహరణ

Last Updated : Oct 2, 2021, 2:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.