ఆంధ్రప్రదేశ్

andhra pradesh

దంపతుల మధ్య గొడవ... అడ్డొచ్చిన తల్లి గొంతు కోసిన కుమారుడు

By

Published : Jun 2, 2022, 2:16 PM IST

రాష్ట్రంలో రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నాయి. క్షణికావేశంలో ఏం చేస్తున్నామనే ఆలోచన లేకుండా కొందరు దాడులకు పాల్పడుతున్నారు. కోపంలో విచక్షణ కోల్పోయి మారణాయుధాలతో దాడి చేసి ప్రాణాలు తీస్తున్నారు. ఆఖరికి రక్త సంబంధీకులను సైతం హతమారుస్తున్నారు. తాజాగా ఓ ఇంట్లో భార్యాభర్తలు గొడవ పడుతుంటే సర్ది చెప్పడానికి మధ్యలో వచ్చిన కన్నతల్లి గొంతు కోశాడో కుమారుడు. ఈ దారుణ ఘటన ఎక్కడ జరిగిందంటే..?

Son killed mother
తల్లి గొంతు కోసిన కొడుకు

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగర శివారు కండ్రిక కాలనీలో దారుణం జరిగింది. దంపతులిద్దరూ గొడవ పడుతుంటే.. ఆమె ఇద్దరికీ సర్దిచెప్పేందుకు వెళ్లింది. క్షణికావేశంలో ఉన్న కుమారుడు ముందు వెనకా చూడకుండా.. కన్నతల్లి గొంతును బ్లేడుతో కోశాడు. మహిళకు తీవ్రగాయాలు కాగా... ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు... ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details