ఆంధ్రప్రదేశ్

andhra pradesh

2023 జూన్ నాటికి.. వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు: మంత్రి పెద్దిరెడ్డి

By

Published : May 9, 2022, 5:13 PM IST

2023 జూన్ నాటికి వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు

రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రాజెక్టుపై విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. 2023 జూన్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లను బిగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు.

2023 జూన్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లను బిగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్ఫష్టం చేశారు. ఇందుకు రూ.6,480 కోట్ల వ్యయమయ్యే అవకాశముందని ప్రభుత్వం అంచనా వేస్తున్నట్టు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాల్లో ఉచిత వ్యవసాయ విద్యుత్ మీటర్ల బిగింపు ప్రాజెక్టు విజయవంతమైందని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయానికి స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రాజెక్టు అంశంపై ఆయన సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.

ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలోని 28,393 విద్యుత్ కనెక్షన్లకు గానూ 20,416 రైతుల బ్యాంకు ఖాతాలతో వాటిని అనుసంధానించామని విద్యుత్ శాఖ అధికారులు మంత్రికి వివరించారు. ప్రతి నెలా ఈ కనెక్షన్లకు 6 నుంచి 14 మిలియన్ యూనిట్ల వరకూ ఖర్చవుతుందని అంచనా వేశామని మంత్రి వెల్లడించారు. అయితే స్మార్ట్ మీటర్ల బిగింపు తర్వాత సగటున 6 మిలియన్ యూనిట్లు మాత్రమే వినియోగం అవుతుందని చెప్పారు. ఇప్పటి వరకూ ప్రభుత్వం రూ.78.31 కోట్ల రూపాయల మొత్తాన్ని విడుదల చేసినట్లు తెలిపారు. ఫిబ్రవరి నుంచి మార్చి నెల కాలానికి సంబంధించిన మొత్తాలను విడుదల చేయాల్సి ఉందన్నారు.

ఇవీ చూడండి

TAGGED:

ABOUT THE AUTHOR

...view details