ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజులు భారీ వర్షాలు!

By

Published : Aug 7, 2022, 6:05 PM IST

Updated : Aug 7, 2022, 6:42 PM IST

Rain Updates: మధ్య బంగాళాఖాతంలో ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల వెంబడి అల్పపీడనం ఏర్పడింది. రానున్న 48 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతవారణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావంతో రానున్న రెండ్రోజుల్లో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

బంగాళాఖాతంలో అల్పపీడనం
బంగాళాఖాతంలో అల్పపీడనం

Rain Updates In AP: వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాల వెంట అల్పపీడనం ఏర్పడింది. రెండు రోజుల్లో ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఆ తరువాత ఇది ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా క్రమంగా పశ్చిమ-వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని వివరించింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాలలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. వచ్చే రెండ్రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఎల్లుండి (మంగళవారం) వరకూ మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని.. విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.

Last Updated : Aug 7, 2022, 6:42 PM IST

ABOUT THE AUTHOR

...view details