ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆర్థిక స్తోమతలేక.. కాడెద్దులుగా భార్యాకూతురు..

By

Published : Jul 30, 2022, 5:04 PM IST

farmer cultivation

ఓ నిరుపేద రైతు కుటుంబానికి కాడెద్దులు కొనే ఆర్థిక స్తోమత లేదు. రెక్కలు ముక్కలు చేసుకుని పంట సాగు చేస్తేనే కడుపు నిండేది. కొనుగోలు భారమై కుటుంబ సభ్యులే కాడెద్దులుగా మారారు. భార్యాకూతురు కాడెద్దుల్లా అరకని లాగుతూ.. వ్యవసాయ పనులను ఇలా సాగిస్తోంది తెలంగాణకు చెందిన ఓ రైతు కుటుంబం.

రైతుల కోసం ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ పథకాలు చేపట్టినా.. ఎన్ని పథకాలు తీసుకొచ్చినా వారి బతుకులు మాత్రం మారడం లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు అభివృద్ధికి వేళ్ల మైల దూరంలో ఉన్నాయి రైతుల జీవితాలు. కాడెద్దులు కొనే స్తోమత లేక.. కనీసం వాటిని అద్దెకు తీసుకనే ఆర్థిక స్థితి లేక ఓ రైతు చేసిన పని చూసి ఆ గ్రామస్థులు షాకయ్యారు. ఇంతకీ ఆ కర్షకుడి చేసిన పనేంటంటే..?

తెలంగాణలోని నారాయణపేట జిల్లా మరికల్‌ మండలం పెద్ద చింతకుంట గ్రామానికి చెందిన లక్ష్మన్న కౌలురైతు. సమీపంలోని వెంకటాపూర్‌లో ఎకరా పొలం కౌలుకు తీసుకొని బెండతోట వేశారు. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన ముసురు వానలతో కలుపు పెరిగింది. సొంతంగా కాడెద్దులు లేకపోవడంతో భార్య, కుమార్తె చెరోవైపు కాడిపట్టి లాగుతుండగా.. రైతు దంతెపడుతూ కలుపు తొలగించారు. కూలీల ద్వారా కలుపు తీయించాలంటే రూ.2,500 వరకూ ఖర్చవుతుందని రైతు తెలిపారు.

ఇవీ చదవండి..

ABOUT THE AUTHOR

...view details