ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Nani Fire On Pawan: 'జగన్​పై విషం చిమ్మేందుకే పవన్‌ అవాకులు, చెవాకులు'

By

Published : Sep 26, 2021, 5:12 PM IST

Updated : Sep 26, 2021, 6:59 PM IST

జగన్​పై విషం చిమ్మేందుకే పవన్‌ అవాకులు, చెవాకులు

ముఖ్యమంత్రి జగన్​పై (CM Jagan) విషం చిమ్మేందుకే పవన్‌ (Pawan) అవాకులు, చెవాకులు పేలుతున్నారని మంత్రి పేర్ని నాని (Perni nani) మండిపడ్డారు. సినీ పరిశ్రమ గురించి పవన్ నిజాలు తెలుసుకోవాలని హితవు పలికారు. సాయిధరమ్ తేజ్‌ రోడ్డుప్రమాదంపై మీడియా (Media) చేసిన తప్పేంటని నిలదీశారు. తెలంగాణ పోలీసులు చెప్పిందే మీడియా రాసిందన్నారు. పీకేకు దమ్ముంటే తెలంగాణ పోలీసులను, కేసీఆర్‌ను (KCR) తిట్టాలన్నారు.

'జగన్​పై విషం చిమ్మేందుకే పవన్‌ అవాకులు, చెవాకులు'

సినీ పరిశ్రమ గురించి పవన్ (pawan kalyan) నిజాలు తెలుసుకోవాలని మంత్రి పేర్ని నాని (perni nani) హితవు పలికారు. ముఖ్యమంత్రి జగన్ (cm jagan)​పై విషం చిమ్మేందుకే పవన్‌ అవాకులు, చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. తాను బందరులో గెలిస్తే.. పవన్ కల్యాణ్ రెండుచోట్ల పోటీ చేసి ఓటమి పాలయ్యారని ఎద్దేవా చేశారు. 'మా' ఎన్నికల్లో ఓట్ల కోసం పీకే అనేక తిప్పలు పడ్డారన్నారు.

"నిర్మాతలకు తెలంగాణ కంటే ఏపీలోనే ఎక్కువ షేర్ వస్తుంది. లవ్‌స్టోరీ సినిమా 510 థియేటర్లలో 3 రోజులుగా ఆడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో వకీల్‌సాబ్‌ సినిమాకు దిల్‌రాజు షేర్‌ రూ.80 కోట్లు. ఏపీలో రూ.55 కోట్లు, తెలంగాణలో రూ.25 కోట్లు వచ్చాయి. పీకేకు వచ్చే రూ.55 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందా ?. పేదల ఖాతాల్లో మా ప్రభుత్వం వేసేది ఏటా రూ.60 వేల కోట్లు. సాయితేజ్‌ రోడ్డుప్రమాదంపై మీడియా చేసిన తప్పేంటి?. తెలంగాణ పోలీసులు చెప్పిందే మీడియా రాసింది. పీకేకు దమ్ముంటే తెలంగాణ పోలీసులను, కేసీఆర్‌ను తిట్టాలి. నా అభిమానుల సంఘం అధ్యక్షుడు.. పీకే. పవన్ కల్యాణ్‌ మనసు నిండా నేనే ఉన్నా. -పేర్ని నాని, మంత్రి

ఆన్‌లైన్‌ టికెట్ల (online cinema tickets) అమ్మకాలపై సినీ పెద్దల వినతిని ఆమోదిస్తే ప్రభుత్వంపై విషం చిమ్మడమేంటని నాని పవన్​ను ప్రశ్నించారు. సినిమా పరిశ్రమను (cine industry) ఇబ్బంది పెట్టే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. కోడికత్తి కేసును ఎన్ఐఏ (NIA) చూస్తోందని..దమ్ముంటే దీనిపై కేంద్రాన్ని, అమిత్‌షాను నిలదీయాలన్నారు. ఇడుపులపాయలో డబ్బుంటే మోదీ (PM modi), అమిత్‌షా (amith sha)కు చెప్పి విచారణ జరిపించాలన్నారు. కాపులకు బీసీ రిజర్వేషన్లు (BC reservations) ఇస్తామన్న తెలుగుదేశం పార్టీని పవన్‌ కల్యాణ్‌ ఎందుకు నిలదీయడం లేదో చెప్పాలన్నారు.

"పవన్ సినిమాల ఆదాయంతోనే ప్రభుత్వం నడుస్తుందా ?. ఆన్‌లైన్ టికెటింగ్ కావాలని 2003 నుంచి సినీపరిశ్రమ కోరుతోంది. గతేడాది జూన్‌లో సినీ పెద్దలు జగన్‌ను కలిసి ఆన్‌లైన్ టికెటింగ్ కోరారు. సీఎం జగన్‌ను కలిసిన వారిలో చిరంజీవి కూడా ఉన్నారు. ఆన్‌లైన్ టికెటింగ్‌తో పవన్ కల్యాణ్‌కు ఏం సంబంధం?. బ్లాక్‌ మార్కెటింగ్, పన్ను ఎగవేత తగ్గుతాయని సినీ పెద్దలు చెప్పారు. టికెట్ల విక్రయానికి ప్రభుత్వం పోర్టల్‌ మాత్రమే నడుపుతుంది. సినిమా టికెట్లను థియేటర్ యాజమాన్యాలే అమ్ముకుంటాయి. వసూలైన డబ్బు మర్నాడే ఎవరిది వారికి చేరుతుంది. 2013 కంటే టికెట్ ధరను 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం పెంచింది."- పేర్ని నాని, మంత్రి

సంబధిత కథనాలు

Last Updated :Sep 26, 2021, 6:59 PM IST

ABOUT THE AUTHOR

...view details