ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రతిభావంతులైన విద్యార్థినులకు ఉపకార వేతనాలు: ఎన్టీఆర్ ట్రస్టు

By

Published : Feb 17, 2022, 10:21 AM IST

NTR Trust: విద్యార్థినులకు ఎన్టీఆర్ ట్రస్టు తరఫున ఉపకార వేతనాలు భువనేశ్వరి వెల్లడించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం, సీబీఎస్ఈ ప్లస్ విద్యార్థినులు అర్హులని.. మార్చి 20 న రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

NTR Trust
ఎన్టీఆర్ ట్రస్టు

NTR Trust: ప్రతిభావంతులైన విద్యార్థినులకు ఎన్టీఆర్ ట్రస్టు తరఫున ఉపకార వేతనాలు ఇవ్వనున్నట్లు ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. ఇందుకుగాను మార్చి 20 న రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్షలో మొదటి 10 ర్యాంకులు సాధించిన విద్యార్థినులకు నెలకు రూ.5 వేలు, తర్వాతి 15 మందికి నెలకు రూ.3 వేల రూపాయల చొప్పున.. ఎన్టీఆర్ విద్యాసంస్థల్లో డిగ్రీ పూర్తి చేసే వరకు ఉపకార వేతనాలు అందిస్తామని పేర్కొన్నారు.

ఎన్టీఆర్ ట్రస్టు

ఇంటర్ ద్వితీయ సంవత్సరం, సీబీఎస్​ఈ ప్లస్ విద్యార్థినులు రాత పరీక్షకు అర్హులని వెల్లడించారు. ఈనెల 17 నుంచి మార్చి 15 వరకు ఎన్టీఆర్ ట్రస్టు వెబ్​సైట్​లో పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. అదనపు సమాచారానికి 76600 02627 / 28 ను సంప్రదించాలని సూచించారు.

ఇదీ చదవండి: water rates: పరిశ్రమలపై నీటి ధరాభారం

ABOUT THE AUTHOR

...view details