ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'మూడు రాజధానుల ఏర్పాటును ఎవరూ ఆపలేరు'

By

Published : Jan 24, 2020, 9:06 PM IST

తెదేపా అడ్డుపడినంత మాత్రాన మూడు రాజధానుల ఏర్పాటు ఆగబోదని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షల మేరకు అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వివరించారు.

మంత్రి కన్నబాబు
మంత్రి కన్నబాబు

మంత్రి కన్నబాబు

తెదేపా అడ్డుపడినంత మాత్రాన మూడు రాజధానుల ఏర్పాటు ఆగబోదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. సంఖ్యాబలం ఉందని శాసనమండలిలో కుట్రలు చేసి ఇప్పటి వరకు మూడు బిల్లులను అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. ప్రజల ఆకాంక్షల మేరకు అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వివరించారు. శాసనమండలి ఛైర్మన్‌కే విచక్షణాధికారం ఉన్నప్పుడు... తాను ఎక్కడ కూర్చొని పరిపాలించాలో ముఖ్యమంత్రికి అధికారం ఉండదా..? అని కన్నబాబు ప్రశ్నించారు.

sample description

ABOUT THE AUTHOR

...view details