ఆంధ్రప్రదేశ్

andhra pradesh

new battery bike: సైకిల్ మోడల్​లో..​ స్కూటర్!

By

Published : Feb 10, 2022, 3:04 PM IST

new bike:రిజిస్ట్రేషన్ లేదు, హెల్మెట్ జరిమానాలు లేవు, పెట్రోల్ బాధ అసలే లేదు. ఎక్కడో పట్టణాల్లో మాత్రమే ఉండే పెట్రోల్​ లెస్​ వాహనం ఇప్పుడు గ్రామాల్లో సైతం విపరీతమైన క్రేజ్​ను సంపాదించుకుంది. కేవలం పట్టణాల్లో మాత్రమే ఉండే ఆ వాహనం తమ ఊరికి రావడంతో అక్కడి ప్రజలు ఎంతో ఆశ్చర్యానికి గురవుతున్నారు. తక్కువ ఖర్చుతో వస్తుండడం వల్ల దానిని కొనడానికి గ్రామస్థులు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. మరి, దాని గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే...

new battery bike
వర్సటైల్ VE-55 బ్యాటరీ బైక్​

ew model battery bike: పెట్రోల్‌ ధరలు రోజురోజూకూ పెరిగిపోతుండటంతో.. ఎలక్ట్రిక్‌ వాహనాలపై వాహనదారులు మొగ్గు చూపుతున్నారు. పలు కంపెనీలు సైతం బ్యాటరీతో నడిచే వాహనాలు తయారు చేస్తున్నాయి. తక్కువ ఖర్చుతో వస్తున్న వాటిని కొనడానికి ప్రజలు వెనకాడడం లేదు. అలాంటి వాహనాన్ని నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం వాసిలి గ్రామానికి చెందిన శ్రీనివాసులు నాయుడు అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. అతడు కొన్న బ్యాటరీ బైక్‌ కొత్తగా ఉండటంతో గ్రామస్థులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

వర్సటైల్‌ VE-55 బ్యాటరీ బైక్​

ఈ వాహనం గురించి ఆసక్తికర విషయాలు...
వర్సటైల్‌ VE-55 మోడల్‌ కలిగిన ఈ స్కూటర్‌ ధర కేవలం 34,000 రూపాయలు మాత్రమే ఉండడం విశేషం. దీనిని 3 గంటలపాటు ఛార్జింగ్‌ చేస్తే 55కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని శ్రీనివాసులు నాయుడు చెబుతున్నారు. ఈ బ్యాటరీ స్కూటర్ గురించి యూట్యూబ్‌ ద్వారా తెలుసుకున్నానని, రాజమండ్రిలో దాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఈ స్కూటర్‌కు రిజిస్ట్రేషన్‌, ఇతర పన్నుల భారం లేదని చెప్పారు. చాలా మంది ఈ బ్యాటరీ స్కూటర్‌ను వింతగా చూస్తూ దాని వివరాలు అడుగుతున్నారని శ్రీనివాసులు తెలిపారు.

"వర్సటైల్ VE-55 మోడల్​ కలిగిన ఈ స్కూటర్ కేవలం 25 వేల రూపాయల పెట్టుబడితో రోజుకు రెండు వందల రూపాయల పెట్రోల్ ఆదా అవుతుంది. మూడు గంటలసేపు బ్యాటరీ ఛార్జింగ్ పెడితే 60 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. యూట్యూబ్​లో చూసి రాజమండ్రి నుంచి ఈ వాహనాన్ని తెచ్చాను. దీనిని తెచ్చినప్పటి నుంచి మా గ్రామంలో వింతగా చూస్తున్నారు. సమీపంలోని ఆత్మకూరు పట్టణంలో సైతం ఈ వాహనాన్ని స్థానికులు ఆసక్తిగా చూస్తున్నారు. కరెంట్ ఛార్జింగ్​తో 60 కిలోమీటర్లు నడిచే ఈ స్కూటర్​కు రిజిస్ట్రేషన్, ఇతర పన్నులు ఏవీ అవసరం లేదు." - శ్రీనివాసులు నాయుడు, బ్యాటరీ స్కూటర్‌ యజమాని

ఇదీ చదవండి:మారుతి సరికొత్త బాలెనో బుకింగ్స్​ ఓపెన్​.. మార్కెట్లోకి అప్పుడే..

ABOUT THE AUTHOR

...view details