ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విచారణ పేరుతో అజయ్​ను బలి తీసుకున్నారు: నారా లోకేశ్

By

Published : Oct 2, 2020, 2:26 PM IST

విచారణ పేరుతో ఎస్సీ యువకుడు అజయ్​ను పోలీసులు బలి తీసుకున్నారని నారా లోకేశ్ ఆరోపించారు. అనారోగ్యంతో అతను చనిపోయాడని తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. అతని కుటుంబసభ్యులు నోరు మెదపకుండా.. వారిని బెదిరించారని మండిపడ్డారు.

nara lokesh
నారా లోకేశ్

విచారణ పేరుతో ఎస్సీలను బలి తీసుకుంటున్నవి పోలీస్ స్టేషన్​లా లేక వైకాపా నాయకుల ఫ్యాక్షన్ డెన్​లా అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. విచారణ అని పిలిచి విజయవాడ కృష్ణలంకకు చెందిన ఎస్సీ యువకుడు అజయ్​ను కొట్టి చంపేశారని ఆరోపించారు. దళితులపై జగన్ రెడ్డి దమనకాండ పరాకాష్ఠకు చేరిందని మండిపడ్డారు. అనారోగ్యంతో అజయ్ చనిపోయాడని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అతని కుటుంబసభ్యులు నోరు మెదపకుండా.. వారిని బెదిరించారని ఆరోపించారు. దుర్గగుడి సభ్యురాలి కుమారుడికో న్యాయం, ఎస్సీ యువకుడికి మరో న్యాయమా అని లోకేశ్ నిలదీశారు.

మాస్క్ పెట్టుకోలేదని కిరణ్​ను కొట్టి చంపారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డువచ్చాడని వరప్రసాద్​కు శిరోముండనం చేశారు. తాజాగా విచారణ పేరుతో అజయ్​ను చంపేశారని లోకేశ్ ఆరోపించారు. బాధిత బంధువుల వీడియోను తన ట్విట్టర్​లో పోస్ట్ చేశారు.

నారా లోకేశ్ ట్వీట్స్

తెదేపా నిజనిర్ధరణ కమిటీ

అజయ్ మృతిపై తెదేపా నిజనిర్ధరణ కమిటీ ఏర్పాటు చేసింది. మాజీ మంత్రి జవహర్, ఉప్పులేటి కల్పన, వాసం మునియ్య, దోమకొండ జ్యోతిలను సభ్యులుగా నియమించారు. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవాలు తెలుసుకుని, నివేదిక రూపొందించి అధినేతకు అందజేస్తుందని కళా వెంకట్రావు తెలిపారు.

ఇవీ చదవండి..

పోలీసు కస్టడీలో నిందితుడి మృతి

ABOUT THE AUTHOR

...view details