ETV Bharat / city

పోలీసు కస్టడీలో నిందితుడి మృతి

author img

By

Published : Oct 2, 2020, 4:46 AM IST

పోలీసుల కస్టడీలో ఓ నిందితుడు మృతిచెందారు. విజయవాడలో ఈ ఘటన జరిగింది. మద్యం అక్రమ రవాణా కేసులో అరెస్ట్ అయిన అజయ్​ అనే యువకుడిని పోలీసులు విచారించారు. గురువారం సాయంత్రం ఆ యువకుడు హఠాత్తుగా మరణించాడు.

పోలీసు కస్టడీలో నిందితుడి మృతి
పోలీసు కస్టడీలో నిందితుడి మృతి

విజయవాడలో యువకుడి అనుమానాస్పద మృతి కలకలం రేపింది. సెప్టెంబర్‌ 17న ఆర్టీసీ కార్గోలో మద్యం అక్రమరవాణా చేస్తున్న కేసులో నిందితుడైన అజయ్‌ను ఎస్​ఈబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అజయ్‌తో పాటు మరొకరినీ విచారించారు. గురువారం మధ్యాహ్నం అజయ్‌ను ఎస్​ఈబీ కార్యాలయానికి తీసుకువచ్చి స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేస్తున్నారు.

అజయ్
అజయ్

గురువారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో హఠాత్తుగా....అతను అనారోగ్యంతో ఇబ్బంది పడ్డాడని, వెంటనే దగ్గరలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లామని అధికారులు చెబుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడని తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి : మంత్రి పెద్దిరెడ్డి నాపై కక్ష కట్టారు : జడ్జి రామకృష్ణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.