ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్యాకేజీ పెంచుకోవడానికే పవన్‌ కల్యాణ్‌ సభ: మంత్రి వెల్లంపల్లి

By

Published : Mar 15, 2022, 7:52 AM IST

Minister vellampally fires on pawan kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్​పై.. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు. తన ప్యాకేజీని పెంచుకోవడం కోసమే.. పవన్ సభ నిర్వహించారని మండిపడ్డారు.

minister vellampally fires on pawan kalyan
ప్యాకేజీ పెంచుకోవడానికే పవన్‌ కల్యాణ్‌ సభ: మంత్రి వెల్లంపల్లి

Minister vellampally fires on pawan kalyan: తన ప్యాకేజీని పెంచుకోవడం కోసమే జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆవిర్భావ సభ నిర్వహించారని.. దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. ఐపీఎల్‌లో వేలంపాట ద్వారా క్రీడాకారులను దక్కించుకుంటారని.. పవన్‌ కల్యాణ్‌ సభ నిర్వహణ ద్వారా రేటు, ప్యాకేజీని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

తనవైపు ఇంత మంది జనం ఉన్నారని, ఎంత ఇస్తారని అడిగేందుకు ఇది ఉపయోగపడుతుందని విమర్శించారు. పవన్‌ కల్యాణ్‌తో రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదన్నారు. ఏడాదికి ఒకటి రెండుసార్లు ఏపీకి వచ్చే అతనికి ప్రజల తరఫున మాట్లాడే నైతిక హక్కు లేదని వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details