ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Telangana Corona Cases: తెలంగాణలో కొత్తగా 2,387 కరోనా కేసులు.. ఒకరు మృతి

By

Published : Feb 4, 2022, 10:57 PM IST

Telangana Corona Cases: తెలంగాణలో కొవిడ్​ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. రాష్ట్రంలో తాజాగా 2,387 కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. వైరస్ బారిన పడి ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

corona cases in telangana
తెలంగాణలో కొత్తగా 2,387 కరోనా కేసులు, ఒకరు మృతి

Telangana Corona Cases: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గత నెలలో నిత్యం మూడు వేలకుపైగా వచ్చిన కేసులు అంతకంతకూ తగ్గుతున్నట్టు ఆరోగ్య శాఖ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 24 గంటల వ్యవధిలో 2,387 కరోనా పాజిటివ్‌ కేసులు.. ఒక మరణం నమోదైంది. కరోనా నుంచి 4,559 మంది కోలుకుని డిశ్చారయ్యారని తెలంగాణ వైద్యారోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,74,215కు చేరింది. కరోనాతో ఇప్పటివరకు 4,097 మంది మృతి చెందారు. కరోనా నుంచి 7,39,187 మంది కోలుకోగా.. రాష్ట్రవ్యాప్తంగా 30,951 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఒక్క రోజులో 79,561 నమూనాలను వైద్య శాఖ పరీక్షించింది

హైదరాబాద్‌లో 688 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. మేడ్చల్‌, సిరిసిల్ల జిల్లాల్లో 131 చొప్పున కేసులు బయటపడ్డాయి. కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లాలో అత్యల్పంగా 10 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 5,49,94,699 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది.

తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details