ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాష్ట్రానికి తెదేపా అవసరాన్ని చాటేలా.. మహానాడు జరపాలి : చంద్రబాబు

By

Published : May 16, 2022, 1:36 PM IST

Updated : May 17, 2022, 4:51 AM IST

Chandrababu on Mahanada: మహానాడు సన్నాహాలపై పార్టీ కమిటీలతో తెదేపా అధినేత చంద్రబాబు ఆన్‌లైన్‌లో సమీక్షించారు. ఒంగోలు సమీపంలోని మండవారిపాలెంలోనే తెదేపా మహానాడు నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. అయితే.. ఒంగోలులోని మినీ స్టేడియం ఇవ్వాలని తెదేపా దరఖాస్తు చేస్తే.. చివరి వరకు నాన్చి.. ఇప్పుడు ఇవ్వం అంటారా? అని పార్టీ నేతలు ధ్వజమెత్తారు. మినీ స్టేడియం మీ తాత జాగీరా? అని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Chandrababu review
'మహానాడు'పై చంద్రబాబు సమీక్ష

Chandrababu on Mahanada: మహానాడును ఒంగోలు సమీపంలోని మండువవారిపాలెంలో మొదట అనుకున్న చోటే నిర్వహించాలని తెదేపా అధిష్ఠానం నిర్ణయించింది. ఒంగోలులోని మినీ స్టేడియం ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరించడంతో మండువవారిపాలెం రెవెన్యూ గ్రామ పరిధిలోని త్రోవగుంట వద్ద ఈ నెల 27, 28 తేదీల్లో మహానాడు జరపాలని నిర్ణయించింది. మహానాడు సన్నాహాలపై పార్టీ కమిటీలతో తెదేపా అధినేత చంద్రబాబు ఆన్‌లైన్‌లో సమీక్షించారు. వర్షాలు వచ్చే అవకాశం ఉందన్న ఉద్దేశంతో మహానాడు నిర్వహణకు ఒంగోలులోని మినీ స్టేడియం ఇవ్వాలని తెదేపా దరఖాస్తు చేస్తే, చివరి నిమిషం వరకు నాన్చి, ప్రభుత్వం నిరాకరించిందని పార్టీ నేతలు ధ్వజమెత్తారు.

ముందుగా దరఖాస్తు చేసుకున్నా, అవసరమైన ఫీజులు ముందే చెల్లించినా స్టేడియం ఇవ్వలేదని మండిపడ్డారు. ‘స్టేడియం ఎందుకివ్వరు? అదేమైనా వాళ్ల తాత జాగీరా’ అని సమావేశంలో పాల్గొన్న నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానాడును వినూత్నంగా, పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేలా నిర్వహించాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా తెదేపా అవసరాన్ని చాటిచెప్పేలా మహానాడు ఉండాలన్నారు. సమయం దగ్గరపడుతున్నందున పనులు వేగవంతం చేయాలన్నారు. మహానాడు ప్రాంగణంలో బుధవారం నుంచి పనులు ప్రారంభిస్తున్నట్లు పార్టీనేతలు తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated :May 17, 2022, 4:51 AM IST

ABOUT THE AUTHOR

...view details