ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆజాదీ కా అమృత మహోత్సవాలు.. రాష్ట్రవ్యాప్తంగా జెండా పండుగ

By

Published : Aug 6, 2022, 10:58 PM IST

Updated : Aug 7, 2022, 12:45 PM IST

Azadi Ka Amrita Mahotsav: అజాదీ కా అమృత మహోత్సవాల్లో భాగంగా... రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జాతీయ జెండాతో ర్యాలీలు జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో విద్యార్థులు ప్రదర్శనలో పాల్గొని... భారత మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తున్నారు.

ఆజాదీ కా అమృత మహోత్సావాలు
ఆజాదీ కా అమృత మహోత్సావాలు

ఆజాదీ కా అమృత మహోత్సవాలు

Azadi Ka Amrita Mahotsav Flag Rally: గుంటూరులో ఆజాదీ కా అమృత మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా 750 మీటర్ల జాతీయజెండాతో ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి ప్రారంభమై ఎన్టీఆర్ స్టేడియం వరకు జరిగిన ఈ ప్రదర్శనలో వేలాదిమంది విద్యార్థులు, మహిళలు, అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులు దేశభక్తుల వేషధారణలో అలరించారు. ప్రతి ఒక్కరూ స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితో పని చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు.

har ghar Tiranga: కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలోని ప్రైవేట్ పాఠశాలకు చెందిన విద్యార్థులు.. ఆజాదీ కా అమృత మహాత్సవాల్లో భాగంగా జాతీయ జెండా పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. భారతమాతకు జై అంటూ నినాదాలు చేశారు. జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్రపాలిత యానంలోనూ మదర్ థెరిసా నర్సింగ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్​ విద్యార్థినులు అమృత మహోత్సవాల్లో భాగంగా తల్లిపాల వారోత్సవం నిర్వహించారు. కాకినాడలోనూ.. స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తి నింపేందుకు విద్యార్థులతో భారీగా జాతీయజెండా ప్రదర్శన నిర్వహించారు. 300 మీటర్ల జాతీయ జెండాతో వేలాదిమంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశ నాయకుల వేషధారణలతో విద్యార్థులు ప్రదర్శనలో పాల్గొన్నారు.

బాపట్ల జిల్లా అద్దంకిలో సీనియర్ సివిల్ జడ్జ్ బాబునాయక్ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ర్యాలీ నిర్వహించారు. కోర్టు ప్రాంగణం నుంచి బయలుదేరి ప్రధాన రహదారుల్లో ర్యాలీ నిర్వహించారు. దేశంలో ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడలని ఆయన ఆకాంక్షించారు.

ఇవీ చూడండి

Last Updated : Aug 7, 2022, 12:45 PM IST

ABOUT THE AUTHOR

...view details