ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TOP NEWS: ప్రధాన వార్తలు @7PM

By

Published : Jun 28, 2022, 6:58 PM IST

...

7pm top news
7pm top news

  • పాపం.. సీఎం జగన్‌కు ఆ జబ్బు వచ్చినట్లుంది: తులసిరెడ్డి

ముఖ్యమంత్రి జగన్​పై కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్​కు కొత్త జబ్బు వచ్చినట్లు ఉందని ఆరోపించారు. ఈ మధ్య కాలంలో పదే పదే తన వెంట్రుక కూడా ఎవ్వరూ పీకలేరని జగన్‌ పదేపదే అంటున్నారని... బహుశా అయనకు పీకుడు జబ్బు వచ్చినట్లుందని ఎద్దేవా చేశారు.

  • ప్రొద్దుటూరులో దర్గా జెండాచెట్టు గోడల పునః నిర్మాణ పనులు ప్రారంభం

వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో సోమవారం దుమారం రేపిన దర్గా జెండాచెట్టు గోడల పునః నిర్మాణ పనులు నేడు మొదలయ్యాయి. నిన్న కూల్చివేతకు గురైన గోడల నిర్మాణ పనులను ఇవాళ కౌన్సిలర్లు ప్రారంభించారు

  • 'వైకాపా నేత.. నన్ను నిర్బంధించి..చిత్రహింసలు పెట్టాడు'

ఆత్మకూరు ఉప ఎన్నికల్లో భాజపాకు మద్దతు పలికినందుకు వైకాపా నేత హజరత్తయ్య తనను నిర్భందించి చిత్రహింసలు పెట్టారని.. భాజపా సానుభూతిపరురాలు పద్దమ్మ ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు

  • కూలిన నాలుగు అంతస్తుల భవనం.. 17 మంది మృతి

ముంబయిలో సోమవారం రాత్రి కుర్లాలోని ఓ భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. శిథిలాల కింద చిక్కుకున్న 12మందిని ఎన్​డీఆర్​ఎఫ్​ సిబ్బంది వెలికితీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

  • జుబైర్​కు మరో 4 రోజులు కస్టడీ.. అరెస్టుపై విపక్షాలు ఫైర్

ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు జుబైర్​కు దిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ నాలుగు రోజుల రిమాండ్ విధించింది. మరోవైపు, జుబైర్ అరెస్టును వ్యతిరేకిస్తూ విపక్షాలు, మానవహక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి.

  • తల నరికి యువకుడి హత్య.. నుపుర్ శర్మకు మద్దతు తెలపడమే కారణం.. మోదీకి వార్నింగ్

రాజస్థాన్ ఉదయ్​పుర్​లో అత్యంత కిరాతక హత్య జరిగింది. ఓ యువకుడ్నిహత్య చేసి తల, మొండెం వేరు చేశారు. మృతుడు కొద్ది రోజుల క్రితం నుపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియో వీడియో పోస్టు పెట్టాడు. హత్య తమపనేనని ఇద్దరు వ్యక్తులు వీడియో విడుదల చేశారు.

  • నిజామాబాద్​ కుండలు.. అత్తరు సీసాలు.. ఆ దేశాధినేతలకు మోదీ కానుకలివే!

జీ-7 శిఖరాగ్ర సదస్సు కోసం జర్మనీ వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ పర్యటనను చిరస్మరణీయంగా మలుచుకున్నారు. ప్రపంచ దేశాధినేతలకు వివిధ రకాల భారతీయ ఉత్పత్తులను కానుకగా అందించారు.

  • అంబానీ సంచలన నిర్ణయం.. ఆ పదవికి రాజీనామా.. కొత్త ఛైర్మన్​ ఎవరంటే...

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కీలక నిర్ణయం తీసుకున్నారు. రిలయన్స్ జియో పగ్గాలను తన పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీకి అప్పగించారు. ఇకపై ఆకాశ్ అంబానీ జియో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్​కు ఛైర్మన్​గా వ్యవహరించనున్నారు.

  • T20 Rankings: అదరగొట్టిన రాధా యాదవ్​.. స్మృతి, హర్మన్​ మళ్లీ అదే స్థానాల్లో

మహిళా క్రికెటర్ల తాజా టీ20 ర్యాంకింగ్స్​ను ప్రకటించింది ఐసీసీ. టీమ్​ఇండియా ఆటగాళ్లు ఏఏ స్థానాల్లో నిలిచారంటే..

  • మాధవన్​ను అలా చూసి షాకైన సూర్య.. ఏం జరిగిందంటే?

సీనియర్​ హీరో మాధవన్​ను చూసి అమిత ఆశ్చర్యానికి గురయ్యారు కథానాయకుడు సూర్య. 'ఇది కలా? నిజమా' అన్నట్లు నోరెళ్లబెట్టారు. అసలేం జరిగిందటే..


ABOUT THE AUTHOR

...view details