ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TOP NEWS: ప్రధాన వార్తలు @ 1PM

By

Published : Dec 16, 2021, 12:59 PM IST

1pm-top-news
1pm-top-news

.

  • Cinema Tickets Issue: సినిమా టికెట్లపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు..ఏంటంటే..!
    Cinema tickets issue: రాష్ట్రంలో సినిమా టికెట్ల వ్యవహారంపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. థియేటర్ల యజమానులు టికెట్‌ ధరల ప్రతిపాదనలను జాయింట్‌ కలెక్టర్‌ (జేసీ) ముందుంచాలని ఆదేశించింది. ఆయనే నిర్ణయం తీసుకుంటారని సూచించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Amravati Sabha at Tirupati: రేపు 'అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ'..చురుగ్గా ఏర్పాట్లు
    Amravati parirakshana Mahodyama Sabha at Tirupati: అమరావతి ఐకాస తిరుపతిలో తలపెట్టిన సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఐకాస నేతలు సభా ప్రాంగణం వద్ద భూమి పూజ నిర్వహించారు.రైతులు అమరావతి నినాదం ఎలుగెత్తి చాటేలా ఈ సభ నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Fake Swiss Bank ఈ స్విస్​బ్యాంకులో నగదు జమ చేస్తే స్వాహా..!
    Fake Swiss Bank : ట్రేడ్ ప్రాఫిట్ ఫండ్​తో 1:3 లాభాలు వస్తాయని ఆశ చూపాడు. నమ్మకం కలిగేలా బాధితులను విమానాల్లో దిల్లీకి తీసుకెళ్లాడు. అక్కడ ఖరీదైన హోటళ్లలో ఉంచి.. విందు వినోదాలతో వారిని మాయచేశాడు. వారు నమ్మేలా కోట్లలో లావాదేవీలు జరుగుతున్నట్లు చర్చలు జరిపాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • గంజాయి తరలిస్తుండగా ప్రమాదం..యువకుడు మృతి
    Young man died while moving marijuana: ద్విచక్ర వాహనంలో గంజాయి తరలిస్తుండగా బైక్ అదుపు తప్పి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 23ఏళ్ల యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన విశాఖ జిల్లా పెందుర్తిలో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'షీనా బోరా చనిపోలేదు.. కశ్మీర్​లో ఉంది'.. సీబీఐకి ఇంద్రాణీ లేఖ
    Indrani Mukherjee letter to CBI: 2012 నాటి షీనా బోరా హత్య కేసులో కొత్త ట్విస్ట్. తన కూతురు షీనా బతికే ఉందని ప్రధాన నిందితురాలు ఇంద్రాణీ ముఖర్జీ పేర్కొన్నారు. కశ్మీర్​లో షీనా కనిపించిందని సీబీఐకి లేఖ రాశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమర వీరులకు ప్రధాని నివాళి
    Vijay Diwas 2021: 1971 యుద్ధంలో భారత్​ విజయం సాధించి 50 ఏళ్లు నిండిన సందర్భంగా దిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు ప్రధాని నరేంద్ర మోదీ. నాటి పోరాట వీరులు, అమర జవాన్ల సేవలను స్మరించుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • గ్రూప్​ కెప్టెన్​ వరుణ్​ సింగ్​కు ఐఏఎఫ్​ నివాళి
    Captain Varun Singh: కెప్టెన్​ వరుణ్​ సింగ్​ భౌతికకాయానికి.. బెంగళూరులోని యెలహంక ఎయిర్​ ఫోర్స్​ బేస్​లో ఐఏఎఫ్​ అధికారులు నివాళులర్పించారు. ఆయన సేవలను స్మరించుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • బంగ్లాదేశ్ విజయ్ దివస్​లో కోవింద్.. 1971 నాటి 'మిగ్' బహూకరణ
    Ramnath kovind in Bangladesh: బంగ్లాదేశ్​ ఢాకాలో నిర్వహించిన విజయ్ దివస్ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ పాల్గొన్నారు. బంగ్లాదేశ్ సైనికుల పరేడ్​ను వీక్షించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Kohli BCCI: వన్డే కెప్టెన్సీ వివాదం.. సునీల్‌ గావస్కర్‌ ఏమన్నాడంటే.?
    Kohli BCCI: టీమ్​ఇండియా వన్డే కెప్టెన్సీ వివాదంపై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ స్పందించాడు. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ చెప్పిన దానికి.. కోహ్లీ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు పొంతన లేదని అన్నాడు. ఈ వివాదానికి తెరపడాలంటే వారిద్దరూ మీడియా ముందుకు వచ్చి.. ఎక్కడ తప్పు జరిగిందో వివరించాలని చెప్పాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రాధేశ్యామ్ 'సంచారి' సాంగ్​ రిలీజ్​
    Radhe shyam Sanchari song: ప్రభాస్​ నటించిన 'రాధేశ్యామ్'​ సినిమా నుంచి 'సంచారి' సాంగ్​ రిలీజై అలరిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 14న విడుదల​ కానుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details