ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TTD EO On Vaikunta Ekadasi: వైకుంఠ ఏకాదశి.. ప్రముఖులు స్వయంగా వస్తేనే దర్శన టికెట్లు: తితిదే ఈవో

By

Published : Jan 7, 2022, 8:12 PM IST

Vaikunta Ekadasi At Tirumala

Vaikunta Ekadasi At Tirumala: వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లుపై తితిదే ఈవో జవహర్‌ రెడ్డి తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో సమీక్షించారు. పర్వదినం నాడు చేపట్టే కార్యక్రమాలు..భక్తులకు కల్పించే వసతులపై ఆరా తీశారు.

ఈ నెల 13న వైకుంఠ ఏకాదశి...ప్రముఖులు స్వయంగా వస్తేనే దర్శన టిక్కెట్లు -తితిదే ఈవో

Vaikunta Ekadasi At Tirumala : వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై తితిదే ఈవో జవహర్‌ రెడ్డి తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో సమీక్షించారు. పర్వదినం నాడు చేపట్టే కార్యక్రమాలు..భక్తులకు కల్పించే వసతులపై ఆరా తీశారు.

తిరుమలలో ఈనెల 13న మొదలుకానున్న వైకుంఠ ద్వాదశి ఉత్సవాలు గత ఏడాది మాదిరిగానే పది రోజుల పాటు జరుగుతాయని తెలిపారు. వేకువ జామున 12గంటల 5 నిమిషాలకు వైకుంఠ ద్వారాలు తెరుస్తామని తెలిపారు. పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఒంటిగంట 45నిమిషాల నుంచి భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనున్నట్లు ఈవో వెల్లడించారు. ప్రముఖులు స్వయంగా వస్తేనే దర్శన టికెట్లు కేటాయిస్తామని... సిఫార్సు లేఖలు తీసుకోమని స్పష్టం చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కరోనా వ్యాక్సినేషన్‌ గానీ కరోనా నెగిటివ్‌ సర్టిఫికెట్‌తో గానీ తిరుమలకు రావాలన్నారు. మాస్కులు, శానిటైజర్లు వినియోగిస్తూ కరోనా నిబంధలను తప్పక పాటించాలని సూచించారు. తిరుమలలో కాటేజీల మరమ్మతుల నేపథ్యంలో వసతి గదుల లభ్యతకు కొంత కొరత ఏర్పడిందని తెలిపారు. భక్తులు సహకరించాలని కోరారు.

ఇదీ చదవండి : TTD EO: రాతప్రతుల డిజిటలైజేషన్​కు సమగ్ర నివేదిక రూపొందించండి: తితిదే ఈవో

అనంతరం బండరాళ్లు పడి దెబ్బతిన్న తిరుమల ఎగువ ఘాట్‌ రోడ్డు మరమ్మతుల పనులను ఈవో జవహర్‌ రెడ్డి పరిశీలించారు. పనుల పురోగతిని ఇంజినీరింగ్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప‌నుల‌ు మ‌రింత వేగ‌వంతం చేయాల‌ని ఆదేశించారు. ఈ నెల 10వ తేదీలోపు నిర్మాణ పనులుు పూర్తి చేసి.. ట్రయ‌ల్ ర‌న్ నిర్వహించాల‌ని సూచించారు. 11వ తేదీ ఉద‌యం నుండి భ‌క్తుల‌కు ఘాట్‌ రోడ్డును అందుబాటులోకి తీసుకురావాల‌న్నారు. అవ‌స‌ర‌మైన ప్రాంతాల్లో బారీకేడ్లు, సైన్‌బోర్డులు, లైటింగ్ ఏర్పాటు చేయాల‌ని, ట్రాఫిక్‌ను క్రమ‌బ‌ద్ధీక‌రించేందుకు భ‌ద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయాల‌ని సూచించారు. దెబ్బతిన్న రోడ్డుపై లైట్ వెహిక‌ల్స్‌ను మాత్రమే అనుమ‌తించాల‌ని, హెవీ వెహిక‌ల్స్‌కు అనుమ‌తి లేద‌ని తెలిపారు.

ఇదీ చదవండి :

ayyappa padayatra: 580 కి.మీ. పాదయాత్రలో అన్నాచెల్లెలు.. !

ABOUT THE AUTHOR

...view details