ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TTD: 'హైకోర్టు తీర్పు.. శ్రీవారి భక్తుల విజయం'

By

Published : Sep 22, 2021, 7:51 PM IST

తిరుమల తిరుపతి దేవస్థానం(ttd) బోర్డులో.. ప్రత్యేక ఆహ్వానితుల కోసం జారీ చేసిన జీవోపై హైకోర్టు(high court) స్టే విధించడం శ్రీవారి విజయమన్నారు భాజపా నేత భానుప్రకాశ్​రెడ్డి. హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన భానుప్రకాశ్ రెడ్డి.. ధర్మకర్తల మండలిలో ఆధ్యాత్మిక చింతన ఉన్న వారికి మాత్రమే సభ్యులుగా అవకాశం కల్పించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

భాను ప్రకాశ్ రెడ్డి
భాను ప్రకాశ్ రెడ్డి

తితిదే ధర్మకర్తల మండలి(TTD Board)లో ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు(high court) స్టే విధించడం శ్రీవారి భక్తుల విజయమని.. ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన తితిదే ధర్మకర్తల మండలి మాజీ సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి అన్నారు. ధర్మకర్తల మండలిని రాజకీయ పునరావాసంగా మార్చేసిన ప్రభుత్వం.. ఇకనైనా తన తీరును మార్చుకోవాలని ఆయన సూచించారు.

ధర్మకర్తల మండలిలో ఆధ్యాత్మిక చింతన ఉన్న వారికి మాత్రమే సభ్యులుగా అవకాశం కల్పించాలని ఆయన అభిప్రాయపడ్డారు. కోర్టు తీర్పుతోనైనా ముఖ్యమంత్రి ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details