ఆంధ్రప్రదేశ్

andhra pradesh

tdp protest: 'రైతు కోసం తెలుగుదేశం'... నేతలను అడ్డుకున్న పోలీసులు

By

Published : Sep 15, 2021, 11:57 AM IST

రైతు సమస్యలపై తెలుగుదేశం పోరుబాట పట్టింది. 'రైతు కోసం తెలుగుదేశం' పేరిట కదం తొక్కుతోంది. నేడు తూర్పుగోదావరి జిల్లాలో తెదేపా శ్రేణులు చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.

tdp
tdp

రైతులకు ఎదురవుతున్న సమస్యలపై ‘రైతు కోసం తెలుగుదేశం’ పేరుతో తెదేపా చేపట్టిన ఐదు రోజుల నిరసన కార్యక్రమం... బుధవారం తూర్పుగోదావరి జిల్లాలో మొదలైంది. జిల్లాలో జగ్గంపేట మండలం నరేంద్రపట్నం వద్ద జెడ్పీ మాజీ ఛైర్మన్‌ జ్యోతుల నవీన్‌ ఆధ్వర్యంలో తెదేపా ట్రాక్టర్ ర్యాలీ చేపట్టింది. ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకోవటంతో రోడ్డుపై బైఠాయించి నేతలు నిరసన చేపట్టారు. మరోవైపు పత్తిపాడు తెదేపా తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీని సైతం పోలీసులు అడ్డుకున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా

రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో తెదేపా నేతలు నిరసన వ్యక్తం చేశారు. నరేంద్ర కూడలిలో ధర్నా చేశారు. అనంతరం తహసీల్దార్ పీఎన్​డీ ప్రసాద్​కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున పార్టీ కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి

HC ON MINING: మీరేమో నిద్రపోతుంటారు.. వాళ్లేమో తవ్వేస్తుంటారు: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details