ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Robbery in locked home : ఇంటికి కన్నం వేసి.. ఇల్లంతా కారం చల్లిపోయారు!

By

Published : Oct 24, 2021, 2:31 PM IST

Updated : Oct 24, 2021, 3:18 PM IST

తాళం వేసిన ఇంటికి కన్నం వేశారు దొంగలు. భారీగా బంగారంతోపాటు వెండిని అపహరించుకుపోయారు. వెళ్తూ వెళ్తూ.. ఇల్లంతా కారం వెదజల్లి మరీ వెళ్లారు! ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం పోతవరం గ్రామంలో జరిగింది.

Robbery In Locked Home
తాళం వేసిన ఇంటికి కన్నం...భారీగా బంగారం మాయం...

తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం పోతవరం గ్రామంలో తాళం వేసిన ఇంటికి కన్నం వేశారు దొంగలు. గ్రామానికి చెందిన నందెపు శ్యామలరావు కుటుంబం పదిహేను రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని విషయం గమనించిన దొంగలు.. గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లో ప్రవేశించారు. 54 తులాల బంగారం, 4 కిలోల వెండి అపహరించుకుపోయారు.

అయితే.. చోరీ తర్వాత ప్రతి గదిలోనూ కారం వెదజల్లి పోయారు! చోరీ సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. దొంగతనం గుర్తులు తెలియకుండా ఉండేందుకే కారం చల్లినట్టు పోలీసులు చెప్పారు. ఇదే గ్రామంలో శనివారం కూడా.. మరో చోరీ జరగటంతో వరుస దొంగతనాలు జరుగుతున్నాయని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. బాధితులను పి.గన్నవరం శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు పరామర్శించారు.

Last Updated : Oct 24, 2021, 3:18 PM IST

ABOUT THE AUTHOR

...view details