ETV Bharat / crime

CASH SEIZED: పంచలింగాల చెక్​పోస్ట్​ వద్ద భారీగా నగదు పట్టివేత..ఎంతంటే..!

author img

By

Published : Oct 24, 2021, 12:51 PM IST

హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తున్న ఓ కారులో సెబ్ అధికారులు భారీ నగదును గుర్తించారు. ఎటువంటి ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్న 75 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.

seb-officers-seized-75-lakh-rupees-cash-at-kurnool
వాహన తనిఖీల్లో బయటపడ్డ భారీ నగదు.. రూ.75 లక్షలు స్వాధీనం

కర్నూలు పంచలింగాల చెక్ పోస్టు వద్ద సెబ్ అధికారులు భారీగా నగదును గుర్తించారు. బీదర్​కు చెందిన గురునాథ్ అనే వ్యక్తి.. కారులో హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వస్తుండగా అధికారులు కారును తనిఖీ చేశారు. ఈ సోదాల్లో ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకువెళ్తున్న 75 లక్షల రూపాయల నగదును గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నగదును తాలూకా అధికారులకు అప్పగించినట్లు సెబ్ సీఐ మంజుల తెలిపారు.

ఇదీ చూడండి:

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జీతాల్లో కోత!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.