ఆంధ్రప్రదేశ్

andhra pradesh

omicron : కర్నూలు జిల్లాలో 80 మందికి ఒమిక్రాన్.. రిపోర్ట్ కలకలం!

By

Published : Dec 26, 2021, 10:19 PM IST

కర్నూలు జిల్లాలో 80 మందికి ఒమిక్రాన్ నిర్థరణ అయినట్లు.. వైద్యశాఖ వెబ్​సైట్​లో నమోదు చేయడం కలకలం రేపింది. అయితే.. వాలంటీర్ తప్పుగా నమోదు చేశారని తర్వాత తేలింది. దీంతో.. మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహించారు.

80 మందికి ఒమిక్రాన్
80 మందికి ఒమిక్రాన్

కర్నూలు జిల్లా కౌతాళం మండలంలోని తోవి గ్రామంలో ఇంటింటికీ ఫీవర్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో 80 మందికి ఒమిక్రాన్ లక్షణాలు ఉన్నట్లు.. వైద్యశాఖ వెబ్​సైట్​లో వాలంటీర్ తప్పుగా నమోదు చేశారు. వాలంటీర్ తప్పిదంతో.. గ్రామస్థులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే.. పొరపాటు జరిగిందని గ్రహించిన అధికారులు.. గ్రామంలోని 80 మందికి మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details