ETV Bharat / city

GUNTUR CORPORATION : జీఎంసీ ముందడుగు.. తడిచెత్తతో ఎరువుల తయారీ

author img

By

Published : Dec 26, 2021, 7:26 PM IST

చెత్తను సద్వినియోగం చేసుకోవడంలో గుంటూరు నగరపాలక సంస్థ ముందడుగు వేసింది. తడిచెత్త నుంచి ఎరువుల తయారీతో ఆదాయ వనరులు పెంచుకునేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

గుంటూరు నగరపాలక సంస్థ
గుంటూరు నగరపాలక సంస్థ

గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో నిత్యం 440 మెట్రిక్ టన్నుల చెత్త పోగవుతూ ఉంటుంది. సేకరణ, డంపింగ్ యార్డుకు తరలింపు ప్రక్రియ ఆర్థిక భారమన్నది అధికారుల మాట. ఎలాగోలా తరలించినా యార్డులో పొడిచెత్తతో కలవటం, గుట్టలుగా పేరుకుపోవటం వల్ల ఇబ్బందులు తలెత్తుతుంటాయి. అందువల్ల శాస్త్రీయ పద్ధతుల్ని అనుసరిస్తే ఆర్థిక మేలుతో పాటు అనారోగ్య సమస్యల్ని నివారించవచ్చు. గుంటూరు కార్పొరేషన్ అధికారులు ఈ దిశగా చర్యలు ప్రారంభించారు. తడి, పొడి చెత్తను వేరుగా సేకరించటం సహా తడిచెత్త నుంచి ఎరువుల తయారీకి కార్యాచరణ రూపొందించారు.

గుంటూరు నగరపాలక సంస్థ

ప్రజలు తడి, పొడిచెత్తను వేరుచేసి పారిశుద్ధ్య కార్మికులకు అప్పజెప్పాల్సి ఉంటుంది. మొదట్లో నిత్యం 20, 30 టన్నులతో ప్రారంభమైన తడిచెత్త సేకరణ ప్రస్తుతం 100 టన్నులకు చేరింది. రోజూ 200 టన్నుల సేకరణ లక్ష్యమని అధికారులు తెలిపారు. నగరంలో వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన తడిచెత్తను ప్లాంట్లకు తరలించి బెడ్ల మాదిరిగా పోస్తున్నారు. ఎరువుగా మారేందుకు గోమూత్రం లేదా ఆవుపేడ కలుపుతామని సిబ్బంది వివరించారు.

ఇవీచదవండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.