ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అంబులెన్స్​లో మద్యం అక్రమ రవాణా

By

Published : Oct 26, 2020, 10:01 PM IST

పోలీసుల నుంచి తప్పించుకునేందుకు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు మద్యం అక్రమ రవాణాదారులు. ఆఖరికి అంబులెన్స్​ను కూడా వదలలేదు. అయితే నిందితుడి ప్రయత్నాన్ని పసిగట్టిన పోలీసులు.. అతన్ని అరెస్టు చేసి మద్యాన్ని సీజ్ చేశారు.

Man arrested for smuggling alcohol in an ambulance
Man arrested for smuggling alcohol in an ambulance


కాదేదీ మద్యం అక్రమ రవాణాకు అనర్హం అన్నట్లు వ్యవహరిస్తున్నారు కొందరు వ్యక్తులు. చివరకు రోగులను తరలించే అంబులెన్స్​లోను పొరుగు రాష్ట్ర మద్యం రవాణాకు తెగించారు. కర్నూలు సమీపంలోని పంచలింగాల చెక్​పోస్టు వద్ద సెబ్(స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో) పోలీసులు సోమవారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు ఖాళీగా వస్తున్న అంబులెన్స్​ను అనుమానం వచ్చి తనిఖీ చేశారు. అంబులెన్స్​లో 14 మద్యం బాటిళ్లను గుర్తించారు. అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన అంబులెన్స్ డ్రైవర్ చంద్రను అరెస్ట్ చేసి మద్యం సీసాలను, అంబులెన్స్​ను పోలీసులు సీజ్ చేశా‌రు.

అంబులెన్స్​లో మద్యం అక్రమ రవాణా

ABOUT THE AUTHOR

...view details