ఆంధ్రప్రదేశ్

andhra pradesh

RTC bus stand closed: అద్దె చెల్లించలేదని ఆర్టీసీ బస్టాండ్​ మూసివేత

By

Published : Sep 22, 2022, 10:31 AM IST

RTC bus stand
ఆర్టీసీ బస్టాండ్‌ ()

RTC bus stand closed: అద్దె చెల్లించలేదంటూ కడప నగరపాలక సంస్థ అధికారులు ఆర్టీసీ బస్టాండ్‌ను మూసేశారు. ఉదయం నుంచి..బస్టాండ్‌లోకి బస్సులు రాకుండా ఆపేశారు. అద్దె చెల్లించాలని ఆర్టీసీ అధికారులకు సూచించినా.. స్పందించకపోవడం వల్ల బస్సులు బస్టాండ్‌లోకి రాకుండా మూసేశారు. బస్సుల కోసం ప్రయాణికులు రోడ్లపై తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోంది.

RTC bus stand closed: కడప ఆర్టీసీ అధికారులు నగరపాలక సంస్థకు అద్దె చెల్లించలేదనే కారణంతో ఉదయం నాలుగు గంటల నుంచి బస్సులను పాత బస్టాండ్​లోకి అనుమతించకుండా నగరపాలక అధికారులు బస్టాండ్​ను మూసేశారు. దీంతో ప్రయాణికులు బస్సుల కోసం రోడ్లపై పడిగాపులు కాస్తూ... అవస్థలు పడ్డారు. ముఖ్యమంత్రి, ఆర్టీసీ స్టేట్ ఛైర్మన్ సొంత జిల్లా కావడం గమనార్హం. కడప పాత బస్టాండ్​ను నగరపాలక అధికారులు నిర్మించారు. అక్కడ ఆర్టీసీ బస్సులను పార్కింగ్ చేసేందుకు ప్రతినెల ఆర్టీసీ అధికారులు... నగరపాలక సంస్థకు అద్దె చెల్లిస్తారు.

ఆర్టీసీ బస్టాండ్‌

కానీ గత 2013 నుంచి ఆర్టీసీ అధికారులు నగరపాలక సంస్థకు దాదాపు రెండు కోట్ల 30 లక్షల రూపాయలు అద్దె చెల్లించలేదు. గతంలో నగరపాలక అధికారులు పట్టించుకోకపోవడంతో ఇది పెరుగుతూ పోయింది. కొత్తగా వచ్చిన సూర్య సాయి ప్రవీణ్ కమిషనర్ ఆర్టీసీ అధికారులకు అద్దె చెల్లించాలని సూచించారు. కానీ ఆర్టీసీ అధికారులు స్పందించకపోవడంతో ఇక చేసేది లేక ఇవాళ తెల్లవారుజామున 4 గంటల నుంచి పాత బస్టాండ్​లోకి బస్సులను పంపకుండా బస్టాండును మూసేశారు. ఇలా చేయడం సరికాదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చర్చించి సమస్యను పరిష్కరించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details