ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Conflict : ఇరువర్గాల ఘర్షణ... ఐదుగురు అరెస్టు

By

Published : Aug 18, 2021, 12:00 AM IST

ద్విచక్రవాహనంతో ఓ మహిళను ఢీకొన్న ఘటనలో రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ... కత్తులతో చంపుకునే వరకు వెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

ఇరువర్గాల ఘర్షణ... ఐదుగురు అరెస్టు
ఇరువర్గాల ఘర్షణ... ఐదుగురు అరెస్టు

గుంటూరు శారదా కాలనీ 17 వ లైన్​లో... కొందరు వ్యక్తులు రెండు వర్గాలుగా ఏర్పడి గొడవ పడుతున్నారన్న సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అక్కడ వెంకటేష్, పటాన్ మస్తాన్ వలీ, మిద్దిసెట్టి మణికంఠ, గేటు తిరుపతయ్య, షేక్ నాగూర్ అనే వ్యక్తులు రెండు గ్రూపులుగా ఏర్పడి ఘర్షణ పడుతున్నారు. పోలీసులను చూసిన ఇరువర్గాలు పారిపోతుండగా... పోలీసులు పట్టుకుని అరండల్​పేట ఠాణాకు తరలించారు. నిందితుల నుంచి 4 వేట కొడవళ్లు, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ నరేష్ కుమార్ వెల్లడించారు.

ఈనెల 4న రాత్రి 10 గంటల సమయంలో శారదా కాలని 17, 16 లైన్ల మధ్య.. వెంకటేష్, మస్తాన్, గోకుల్ అనే ముగ్గురు వ్యక్తులు ద్విచక్రవాహనాన్ని వేగంగా నడుపుతూ ఓ మహిళను ఢీ కొట్టారు. ఈ ఘటనతో ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళ కుటుంబీకులు గేటు తిరుపతయ్య, షేక్ నాగూర్​లు వారితో గొడవ పడ్డారు. కత్తులతో ఒకరినొకరు చంపుకునేందుకు ప్రయత్నించారని సీఐ నరేష్ కుమార్ వివరించారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు వెల్లడించారు.

ఇదీచదవండి.

ECO ZONE: ఎకో జోన్‌పై ప్రభుత్వ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం

ABOUT THE AUTHOR

...view details