ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జగన్​కు దమ్ముంటే.. వారిని సీఎం చేయాలి: జీవీఎల్

By

Published : Apr 14, 2022, 7:03 PM IST

BJP MP GVL: కొత్త మంత్రివర్గంలో ఒక్కరికీ సరైన బాధ్యతలు అప్పగించలేదని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా గుంటూరులో పర్యటించిన ఆయన.. మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం నెలకొందన్నారు.

BJP MP GVL:
"నూతనంగా ఏర్పడిన మంత్రివర్గంలో ఒక్కరికీ సరైన పదవులు ఇవ్వలేదు"- జీవీఎల్

BJP MP GVL: సామాజిక న్యాయం చేస్తున్నామని ప్రగల్భాలు పలుకుతున్న సీఎం జగన్​కు దమ్ము, ధైర్యం ఉంటే.. బీసీ, ఎస్టీ, ఎస్సీలకు ముఖ్యమంత్రి పదవి అప్పగించాలని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు సవాల్ చేశారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా గుంటూరులో పర్యటించిన ఆయన.. మీడియాతో మాట్లాడారు. నూతనంగా ఏర్పడిన మంత్రివర్గంలో ఒక్కరికీ సరైన బాధ్యతలు ఇవ్వలేదన్నారు. గతంలో హోంమంత్రిని ఇంటికే పరిమితం చేశారని .. ఇప్పుడు కొత్తగా వచ్చిన హోంమంత్రి సైతం ఇంటికే పరిమితమయ్యారన్నారు. విద్యుత్ కోతలతో రాష్ట్రం అంధకారంలో ఉందన్న జీవీఎల్.. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం నెలకొందన్నారు. తన చేతకాని తనానికి జగన్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలకు జగన్ తగిన మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు.

ABOUT THE AUTHOR

...view details